Illu Illalu Pillalu Today Episode October 28th : నిన్నటి ఎపిసోడ్ లో..ముగ్గురు కొడుకులు కోడలు అత్తమామలు తెచ్చిన బట్టలను కట్టుకొని పూజకు వస్తారు. ముగ్గురు కొడుకులు కి తాను తెచ్చిన బట్టలు బాగా సూట్ అయ్యాయి అని రామరాజు సంబరపడిపోతూ ఉంటాడు.. ఈ కలరు ఈ డ్రెస్సు నీకు బాగా సెట్ అయ్యారా అని ముగ్గురి కొడుకులు చూసి మెచ్చుకుంటారు. ఇక ఒక్కొక్క జంట ఒక్కొక్కసారి వచ్చి పూజలో పీటల మీద కూర్చుంటారు.. వేదవతి రామరాజు తన ముగ్గురు కొడుకులను కోడలను చూసి మూడు జంటలు చూడముచ్చటగా ఉన్నారు.. వీళ్ళని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడిపోతున్నాయి. అనకూడదు కానీ నా ముగ్గురు కోడలు కొడుకులు ఎంత అందంగా ఉన్నారో చూడముచ్చటగా ఉన్నారు అని వేదవతి తెగ సంబరపడిపోతూ కొడుకులు కోడళ్ల పై పొగడ్తల వర్షం కురిపిస్తుంది.. ధీరజ్ కోసం పోలీసులు వస్తారు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్పగానే అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ కోసం రామరాజు కుటుంబం పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ మా వాడు ఏ నేరం చేయలేదండి ఎంత చెప్పినా సరే.. కేసు పెట్టిన వ్యక్తి మాత్రం అస్సలు వినడు.. నా కూతురిని నేనే దగ్గరుండి మీ కొడుకు కారులో ఎక్కించాను ఆ తర్వాత నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. మీ వాడే కిడ్నాప్ చేశాడు మా అమ్మాయిని క్షేమంగా మా ఇంటికి తీసుకు రమ్మని చెప్పండి.. అప్పుడు రామరాజు మా కొడుకు ఏ తప్పు చెయ్యండి వాడికి ఇద్దరు అక్కలు ఉన్నారు అమ్మాయిలు విలువ వాడికి తెలుసు అని ఎంత చెప్పిన సరే ఆ వ్యక్తి వినడు..
అతను రామరాజుని దారుణంగా అవమానించేలా మాట్లాడుతాడు. ధీరజ్ ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా సరే అతని వినడు. ఏంటండీ మీరు చేసేది ఏమైనా బాగుందా అని అంటాడు. ఇక రామరాజు నా కొడుకే తప్పు చేయలేదు నా కొడుకుని తీసుకెళ్లే వరకు నేను బయటికి వెళ్ళను అని అంటాడు. దాంతో అక్కడినుంచి కానిస్టేబుల్ తో బయటికి బలవంతంగా గెంటేస్తారు. ఏంట్రా ఇక నుంచి వెళ్ళేది నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడు. నేను నా కొడుకు వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాను అని తీసుకొని వెళ్తాను అని రామరాజు అక్కడే కూర్చుంటాడు..
తిరుపతి మన స్టేషన్ బెయిల్ ఇప్పించి ధీరజ్ని తీసుకుని వెళ్దాం.. ధీరజ్ ఏ తప్పు చేసి ఉండరు. ఆ విషయం నాకు కూడా తెలుసు బావ కానీ పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా.. ఎవిడెన్స్ ఉన్నాయి అంటున్నారు కదా.. మనం లాయర్ ను తీసుకొచ్చి బెయిల్ ఇపిద్దామని అనగానే సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్తారు.. ప్రేమ నర్మదా ఇద్దరు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు.. మిమ్మల్ని ఎవరిని స్టేషన్ వరకు రావద్దు అని చెప్పాను కదా అమ్మ ఎందుకు వచ్చారు అని రామరాజు అంటాడు.. ప్రేమ ధీరజ్ కి ఏదో అయిపోతుందని కంగారుపడుతూ భయపడుతుంటే తీసుకొచ్చాను మావయ్య అని నర్మదా అంటుంది.
ధీరజ్ నేను చూడాలి అని ప్రేమ పోలీస్స్టేషన్లోకి వెళుతుంటే అక్కడ వాళ్ళు వెళ్ళనివ్వరు. ప్రేమ కిటికీలోంచి ధీరజ్ని చూడాలని వెళుతుంది. ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది. నేను చెప్పినట్లు నువ్వు విని ఉంటే ఇంత పని జరిగేది కాదు కదా అని ప్రేమ అంటుంది. కర్మ నుంచి తప్పించుకోలేము అని ధీరజ్ అంటాడు. ఇక శ్రీవల్లి భాగ్యం దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని కక్కేస్తుంది. ధీరజ్ అలాంటివాడు కాదు అని ఆనందరావు ఎంత చెప్పినా సరే ఏ పుట్టలో ఏ పాముంటుందో చెప్పడం కష్టమే కదా నాన్న ఏమో ధీరజ్ చేసే ఉంటాడేమో అని అంటుంది.
ఈ సందర్భంగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని శ్రీవల్లి అంటుంది. అయితే ఆ ధీరజ్ గురించి లేనిపోనివి చెప్పి మావయ్య గారి కి కోపం తెప్పిస్తానని శ్రీవల్లి అంటే.. అలాంటివి కాదు మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని భాగ్యం రామరాజుకి ఫోన్ చేస్తుంది. కావాలనే రామరాజు కోపం తెప్పించేలా మాట్లాడుతుంది భాగ్యం. ఇక రామరాజు చెప్పిన సరే బాగ్యం వినదు. నర్మదా ఫోన్ తీసుకొని నేను మాట్లాడతాను ఇవ్వండి అని అంటుంది. భాగ్యం నర్మదకు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. మీరు లాయర్ ని పంపించండి మేము వెయిట్ చేస్తూ ఉంటామని ఫోన్ పెట్టేస్తుంది.
Also Read: అవని మాటకు అక్షయ్ ఫిదా.. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పల్లవి.. పల్లవి, చక్రధర్ మధ్య గొడవ..
అటు లాయరు స్టేషన్ బెయిల్ ఇవ్వడం కుదరదు ఇది కిడ్నాప్ కేసు కాబట్టి.. మీరే వెళ్లి అమ్మ ఎక్కడుందో వెతికి పోలీస్ స్టేషన్కు తీసుకురండి. అప్పుడే వాళ్ళు అతని పంపిస్తారు అని సలహా ఇస్తారు. అమ్మాయిని వెతకడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు సాగర్ చందు.. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్ తో మాట్లాడుతారు. ఏంటి ఏమైంది అనేది తెలుసుకోండి బాబాయ్ గారు మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడుతారు. ఆ కానిస్టేబుల్ అసలు విషయాన్నీ కనుక్కొని వాళ్ళకి చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..