ananya panday (2)
Ananya panday Latest Photos: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. లైగర్ చిత్రంతో ఈ భామ తెలుగు ఆడియన్స్‌కి కూడా పరిచయమైంది.
ananya panday (3)
అంతకు ముందు హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఈ భామ లైగర్‌తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో అన్ని భాషల్లో మంచి మార్కెట్ సంపాదించుకోవాలని చూసింది.
ananya panday (4)
కానీ, ఈ మూవీ డిజాస్టర్ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. లైగర్ తర్వాత ఆ స్థాయిలో ఈ భామకు ఆఫర్స్ లేవు. ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఇటీవల కేసరి చాప్టర్ 2 మూవీలో నటించింది.
ananya panday (5)
ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. కాగా స్టార్ కిడ్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె తరచూ ట్రోల్స్ బారిన పడుతుంది. ముఖ్యంగా తన శరీరాకృతిపై ట్రోలర్స్ కామెంట్స్ చేస్తుంటారు.
ananya panday (6)
చీపురు పుల్లలా ఉంది.. ఈమె హీరోయిన్ ఏంటీ అంటూ ట్రోల్స్ వస్తుంటాయి. స్టార్ కిడ్ అయినప్పటికీ ఆమెకు విమర్శలు, ట్రోల్స్ తప్పలేదు. అయినప్పటికీ కాన్ఫిడెన్స్ పొగొట్టుకోకుండా.. తన నటనతో ట్రోలర్స్‌కి సమాధానం ఇస్తుంది.
ananya panday (7)
హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన గ్లామరస్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.
ananya panday (8)
తాజాగా ఈ భామ ట్రెండీ వేర్లో సందడి చేసింది. బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ మూవీ ప్రీమియర్‌లో పాల్గొన్న ఆమె గోల్డెన్ డ్రెస్ లో మెరిసింది.
ananya panday (9)
సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైన్ అమి పటేల్ డిజైన్ చేసిన ఈ ట్రేండీ వేర్ ధరించి మూవీ ప్రీమియర్‌లో ఫ్యాషన్ దివాగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ananya panday (10)
ఈ డిజైనర్లో అనన్య ఫోటోలకు ఫోజులు ఇస్తూ అందాల విందు చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.