BigTV English
Advertisement

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : ప్రేమలో ఎంత మధురంగా ఉంటుందో కొన్ని సినిమాలే చూపించగలవు. అలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఈ స్టోరీలు మనసును హత్తుకుంటాయి. గుండెల్లో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ “పాస్ట్ లైవ్స్” అనే కొరియన్ సినిమాని చూస్తే కలుగుతాయి.
ఈ సినిమా టీనేజ్ లో విడిపోయిన ప్రేమికులు, 24 సంవత్సరాల తరువాత మళ్ళీ కలుస్తారు. ఎక్కడా నెగిటివ్ థింక్ లేకుండా, ఈ సినిమాని అద్భుతంగా చూపించారు. ఈ సినిమా ఆస్కార్ కి కూడా నామినేట్ అయింది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

“పాస్ట్ లైవ్స్” (Past Lives) 2023లో విడుదలైన కొరియన్ రొమాంటిక్ మూవీ. సెలీన్ సాంగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో గ్రెటా లీ (నోరా), టెయో యూ (హే సంగ్), జాన్ మగారో (ఆర్థర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని, పలు అవార్డులను గెలుచుకుంది. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్ కి నామినేట్ అయింది. 5 విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నామినేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, Lionsgate Play, జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

దక్షిణ కొరియాలోని సియోల్‌లో నా యౌంగ్, హే సంగ్ అనే ఇద్దరు 12 ఏళ్ల పిల్లలు, స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. నా-యౌంగ్ చాలా తెలివైన, అందమైన అమ్మాయి. హే సంగ్ ఆమెను ఇష్టపడతాడు. ఒక రోజు వాళ్లు డేట్‌కు కూడా వెళ్తారు. కానీ ఇంతలో నా-యౌంగ్ ఫ్యామిలీ కెనడాకు వెళ్లిపోతుంది. వాళ్లు కలవడానికి వీల్లేకుండా పోతుంది. హే సంగ్ బాధపడతాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నా-యౌంగ్ పేరు నోరాగా మారుతుంది. ఆమె న్యూయార్క్‌లో రచయిత్రి గా ఉంటుంది. హే సంగ్ సియోల్‌లో ఇంజనీర్‌గా పని చేస్తుంటాడు. ఒక రోజు ఫేస్‌ బుక్ లో నోరా తన పాత పేరును సెర్చ్ చేస్తుంది. దీని వల్ల హే సంగ్ ఆమెను కనిపెడతాడు. వాళ్లు స్కైప్లో రోజూ గంటల తరబడి మాట్లాడుకుంటారు. చిన్నప్పటి గుర్తులు, ఇప్పటి జీవితాలును పంచుకుంటారు.


Read Also : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

అయితే నోరాకి ఇప్పుడు ఆర్థర్ అనే వ్యక్తికి భార్య. ఇక హే సంగ్ కూడా న్యూయార్క్‌కు వస్తాడు. ఒక వారం మాత్రమే వాళ్లు మళ్లీ కలుస్తారు.
చివరి రోజు హే సంగ్ విమానాశ్రయానికి వెళ్తాడు. నోరా అతన్ని డ్రాప్ చేస్తుంది. అక్కడే ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. నోరా ఏడుస్తూ నువ్వు నా గత జన్మలో ఎవరో కావచ్చు, కానీ ఈ జన్మలో నువ్వు ఇక్కడ లేవు అని అంటుంది. హే సంగ్ కూడా కన్నీళ్ళు పెట్టుకుని వెళ్లిపోతాడు. నోరా ఇంటికి వచ్చి ఆర్థర్‌ను గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఈ సినిమా ఇలా ఫీల్ గుడ్ మెమొరీతో ముగుస్తుంది.

 

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

Big Stories

×