E-Paper
Advertisement

Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన

Jagtial Snake Bite: నెల రోజుల్లో ఏడుసార్లు పాము కాటు.. పగబట్టిందేమోనని కుటుంబ సభ్యుల భయాందోళన
Advertisement

Jagtial Snake Bite: జగిత్యాల జిల్లాలో ఓ విచిత్ర ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఓ యువకుడిపై పాము పగబట్టిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. నెల రోజుల్లో ఏకంగా ఏడుసార్లు ఆ యువకుడు పాము కాటుకు గురయ్యాడు. చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి రాగానే మళ్లీ పాము కాటు వేస్తుంది. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.

ఏడుసార్లు పాము కాటు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు(28) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతడిని గత నెలలో ఓ పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణపాయం తప్పింది. అయితే ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే యువకుడు మళ్లీ పాముకాటుకు గురయ్యాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఏడుసార్లు పాము కాటుకు గురయ్యాడు.

ఆసుపత్రి నుంచి రాగానే

Advertisement

ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇంటికి రాగానే మళ్లీ పాము కాటు వేస్తుండటంతో యువకుడితో పాటు కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. తమ కుమారుడిపై పాము పగబట్టిందని అంటున్నారు. తమ కుమారుడు ఇంట్లో లేనప్పుడు పాము కనిపించడంలేదంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చి కాటు వేస్తుందో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. పామును పట్టుకునేందుకు ప్రయత్నించినా దొరకడంలేదని చెబుతున్నారు.

పాము పగబట్టిందేమో!

పాము కాటు విషయం గ్రామంలో తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. యువకుడ్ని పాము పగబట్టిందేమోనని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాము కాట్లు ఎక్కువగా ఉంటాయని కాబట్టి నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Advertisement

Also Read: Crime News: దారుణం.. పరీక్షల్లో ఫెయిలయ్యానని హీలియం గ్యాస్ పీల్చి వ్యక్తి ఆత్మహత్య..

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×