Kushaiguda: మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలస్ స్టేషన్ ఎదుట ఒ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి కుషాయిగూడలో ఆటో నడుపుతూ ఉంటాడు. మద్యం సేవించి ఆటో నడుపుతున్న క్రమంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కడంతో ఆటో తో పాటు అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లారు. ఎంత సేపటికి ఆటో ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై.. పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మీన్ రెడ్డి దమ్మాయిగూడా నివాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.