E-Paper
Advertisement

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!

Bhuapalapally:  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మళ్లీ టోర్నాడో కలకలం.. విరిగిపడ్డ చెట్లు, సమీపంలోని పొలాలు ధ్వంసం!
Advertisement

Bhuapalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులను టోర్నాడో భయం మరోసారి వెంటాడింది. గతంలో ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతాలను వణికించిన ఈ ప్రకృతి వైపరీత్యం, ఇప్పుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపింది. తాజాగా పలిమెల మండలంలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో టోర్నాడో సృష్టించిన విధ్వంసం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ టోర్నడో తరహా గాలుల ధాటికి అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి.

వివరాళ్లోకి వెళితే,  ములుగు జిల్లాలోని లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా చెలరేగిన పెనుగాలులు బీభత్సానికి పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. మరికొన్ని చెట్లు విరిగిపడ్డాయి. ఈ టోర్నాడో విధ్వంసం అడవిని ఆనుకుని ఉన్న సమీపంలోని పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. పొలాల గట్ల వెంబడి, పొలాల్లో ఉన్న చెట్లను పెకిలించుకుంటూ టోర్నడో ముందుకు సాగడంతో ఆ ప్రాంతమంతా దారుణంగా మారింది.

Advertisement

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. దిగేసిన పందెం రాయుళ్లు, గెలుపు-మెజార్టీ-సెకండ్ ప్లేస్‌పై ఫోకస్

ఉదయం తమ వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లిన రైతులు, అక్కడ నెలకొన్న దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యారు. చెట్లు విరిగిపడి, కొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు అప్రమత్తమై, ఈ సమాచారాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు అందించారు. రైతుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రస్తుతం టోర్నాడో ప్రభావిత లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Advertisement

కాగా, ఈ ఘటన జిల్లా వాసులకు గత సంవత్సరం  ఆగస్టు 31 సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ వర్షంతో కూడిన గాలుల కారణంగా దాదాపు 50 వేల చెట్లు నేలకొరిగాయి.  ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, 15 కి.మీ పరిధిలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు నేలకూలాయి. ఇప్పుడు మళ్లీ అదే విధ్వంసం పునరావృతం కావడంతో ప్రజలు కలవరపడుతున్నారు.

 

 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×