Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. 12 కిలోల హైడ్రో ఫోనిక్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. మహిళా ప్రయాణికురాలి వద్ద ఉన్న రెండు బ్యాగుల్లో 12 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 కోట్లు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా మహిళా ప్రయాణికురాల వద్ద అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మహిళపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Crime News: 11 నెలల పాపను నేలకేసి కొట్టి చంపేసిన కసాయి తండ్రి