Chinamayi: సింగర్ చిన్మయి తరచు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈమె మంగళసూత్రం(Mangalasutra) వివాదం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మహిళల గురించి ఏ చిన్న వివాదం తలెత్తిన వెంటనే చిన్మయి (Chinmayi)స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు . తాజాగా మంగళసూత్రం వేసుకోవడం గురించి ఇటీవల తన భర్త రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఈ విమర్శలపై ఈమె స్పందిస్తూ తన భర్తకు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలిచారు.
రాహుల్ రవీంద్రన్ ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఆయన పెళ్లి తర్వాత మహిళలు కచ్చితంగా తాళి వేసుకోవాలనే సాంప్రదాయం గురించి మాట్లాడుతూ నేనైతే తన భార్య చిన్మయిని ఎప్పుడు మంగళసూత్రం వేసుకోమని బలవంతం చేయలేదని, మంగళసూత్రం వేసుకోవడం, వేసుకోకపోవడం తన ఇష్టమని తెలిపారు. ఇలా మంగళసూత్రం వేసుకోవడం గురించి రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది ఈయనకు మద్దతుగా నిలబడ్డారు. మరికొంతమంది ఇలాంటి వ్యాఖ్యల పట్ల మీపై ఉన్న గౌరవం కాస్త పోయింది అంటూ కామెంట్లు చేశారు. ఇలా ఈ విషయంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో చిన్మయి రంగంలోకి దిగారు.
ఈ సందర్భంగా తన భర్త చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఈమె స్పందిస్తూ.. ఆయన ఏదో సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేశారు.. మంగళసూత్రం గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చపై ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు.. కానీ మన దేశంలోని మహిళల గురించి తాను ఆందోళన చెందుతున్నాను అంటూ ఈమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా చిన్మయి మహిళలకు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు తీవ్ర దుమారం రేపడంతో ఈమె కూడా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
He literally said it in some context on an interview which has become a tweet. The rage from the men calling him all sorts of abuses – I am worried for the women here truth be told
— Chinmayi Sripaada (@Chinmayi) November 4, 2025
ఇక చిన్మయి ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే ఈమె నటుడు రాహుల్ రవీంద్రన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఇక రాహుల్ రవీంద్రన్ హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈయన నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పలు సినిమాలకు బాధ్యతలు వహించారు. త్వరలోనే రాహుల్ రవీంద్రన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా లవ్ రొమాంటిక్ సినిమాగా విడుదల కానుంది. నవంబర్ 7వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో రాహుల్ రవీంద్రన్ కూడా బిజీగా ఉన్నారు.
Also Read: Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!