Hebah Patel (1)
Hebah Patel Latest Photos: హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కుమారి 21F చిత్రంతో ఈ భామ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతకు ముందే అలా ఎలా అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
Hebah Patel (5)
కానీ, ఆమెకు గుర్తింపు ఇచ్చింది మాత్రం కుమారి 21F చిత్రమే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో ఈ భామకు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇందులో బోల్డ్‌గా కనిపించిన హెబ్బా తనదైన అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
Hebah Patel (2)
దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కుమార్ 21F తర్వాత నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపు రాలేదు.
Hebah Patel (4)
దీంతో సినిమాలకు కాస్తా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత ఓదెల రైల్వే స్టేషన్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో హెబ్బా నటనకు విమర్శకులు ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రంలో మరోసారి ఆమె కెరీర్ పరంగా యాక్టివ్ అయ్యింది.
Hebah Patel (6)
ఆ తర్వాత ఈ భామకు మళ్లీ ఆఫర్స్ క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో ఈ భామకు ఆఫర్స్ వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
Hebah Patel (3)
తాజాగా సైమా అవార్డులో బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. ఈ సందర్బంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ బాడికాన్ డ్రెస్‌లో ఈ భామ హాట్ ఫోజులతో మాయ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.