BigTV English

Kalyan Ram : కొత్త డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ మూవీ.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్..!

Kalyan Ram : కొత్త డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ మూవీ.. రిస్క్ వద్దంటున్న ఫ్యాన్స్..!
Advertisement

Kalyan Ram : టాలీవుడ్ యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. బింబిసారా వంటి బ్లాక్ బాస్టర్ మూవీలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ మూవీ తర్వాత ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తల్లి కొడుకుల సెంటిమెంటు వర్కౌట్ అయింది గానీ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈసారి కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సినీ ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? గతంలో ఆయన ఏం చేశాడు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..


కొత్త డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ మూవీ..

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ తర్వాత సినిమాలకు కళ్యాణ్ రామ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత కొత్త సినిమాను ఎప్పుడు ప్రకటిస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే, ఈసారి కళ్యాణ్ రామ్ వేరే ప్లాన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఒకటి బింబిసారా సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.. అలాగే మరొకటి కొత్త డైరెక్టర్ తో చేస్తున్నాడు. రైటర్ శ్రీకాంత్ విస్సా దర్శకుడిగా మారుతూ ఓ స్టోరీని కళ్యాణ్ రామ్‌కు వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు 2026 లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయి. మరి కళ్యాణ్ రామ్‌ను ఈ సినిమాలో శ్రీకాంత్ విస్సా ఎలా చూపెట్టబోతున్నాడనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతున్నాయి.

Also Read : శ్రీవల్లికి మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రేమ.. ధీరజ్ కు నిజం చెప్పిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్..


బింబిసార 2 అప్డేట్.. 

బింబిసారా క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు కథ నేపథ్యంలో నిర్మించిన సినిమా. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ మూవీ కళ్యాణ్ రామ్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు సీక్వెల్ మరో సినిమా రాబోతున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్ రామ్ హీరోగా మాత్రమే కాదు తన సొంత బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు. అలాగే ఆయన సొంత బిజినెస్లను కూడా చూసుకుంటూ బిజీగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.. మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అన్నది త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Related News

Janhvi kapoor: సినిమాలలోకి కూతుర్ని పంపించడానికి శ్రీదేవి అంత పని చేసిందా?

Sara Ali Khan: ఇండస్ట్రీపై సారా సంచలన వ్యాఖ్యలు.. భరించలేనిదంటూ?

Akhanda 2: ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య

Tollywood Heroines : సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Big Stories

×