Illu Illalu Pillalu Today Episode October 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ఇంట్లో ఉన్న మందు అంతా దాచేసాను కదా.. ఇక నాకు ప్రేమ మందు తాగుతుందని భయం లేదు అనుకొని హ్యాపీగా ఉంటుంది.. రామరాజు దగ్గరికి తిరుపతి వెళ్తాడు. అయితే రామరాజు మందు తాగుతూ తన బాధని తిరుపతితో చెప్పుకుంటాడు. కానీ తిరుపతి మాత్రం నువ్వు దుర్మార్గుడి బావ.. మందు కోసం ఇందాకడి నుంచి కుక్కలాగా గ్లాస్ పట్టుకొని నిలబెట్టుకుని ఉన్నాను కనీసం నువ్వు మందు వేద్దాం అని లేదు. సాటి తాగుబోతు గురించి నువ్వు ఆలోచించాలి కదా బావ అని అంటాడు. తిరుపతి మందు కలుపుకున్న కూల్ డ్రింక్ ను ఆడాళ్ళు తాగాలని అనుకుంటారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడతారు. నర్మద, ప్రేమ, వేదవతి ముగ్గురు నిజాలు చెప్పలేక ఓడిపోయామని ఒప్పేసుకుంటారు. శ్రీవల్లి గెలుస్తుంది కానీ ప్రేమకు ఆ కూల్ డ్రింక్ ని ఇస్తుంది. నా దాన్ని ప్రేమ తాగేస్తుంది తిరుపతి దగ్గరనుంచి అసలు నిజం తెలుసుకొని శ్రీవల్లి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీవల్లి మాత్రం మందు తాగేసిందంటే నాకు చుక్కలు చూపిస్తుంది అని టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్లి దుప్పటి ముసుగేసుకుని భయపడుతూ ఉంటుంది.. అప్పుడే బల్లెక్కా అంటూ ప్రేమ నట్లు అనిపించడంతో శ్రీవల్లి బాబోయ్ నా పక్కనే ఉండి పిలిచినట్లు అనిపిస్తుంది. ఎక్కడుంది అని అనుకుంటుంది. కంటిన్యూగా ఆపకుండా పిలవడంతో ఏంటి ప్రేమ వచ్చేసినట్టుంది ఇక నా పని మెడ మీద కత్తి అయినట్లే అయిపోయింది అని శ్రీవల్లి షాక్ అవుతుంది.. ప్రేమ పిలుపు విని ఎక్కడుందబ్బా అని వెతుకుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది..
ప్రేమ తన గదిలోనే ఉండడంతో అదేంటి నేను తలపేసాను కదా నువ్వెలా వచ్చేసావని అడుగుతుంది. నీ కన్నా ముందే ఈ గదిలోకి వచ్చేసాను తెలుసా అని ప్రేమ అనగానే అయ్య బాబోయ్ నాకు ఈరోజు ముడినట్లే అని శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది.. మొన్న ప్రేమ నువ్వు తాగేసి నా చేత డాన్స్ చేయించావు గాజు పెంకులు గుచ్చుకున్న ఈ రోజు నాకు డాన్స్ చేతకాదు అబ్బా అనేసి శ్రీవల్లి అంటుంది. మొన్న నువ్వు చేసిన డాన్స్ ని చూసి నాకు డాన్స్ మీదే విరక్తి కలిగింది. ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం అని అంటుంది.. ఇవాళ ఏమి చేయలేనబ్బా అని అనగానే నా కత్తి చూసావా ఇది నీ మెడ మీద భరతనాట్యం చేస్తుందని ప్రేమ బెదిరిస్తుంది.
ఆ మాట వినగానే శ్రీవల్లి నేను ఆల్రెడీ తలుపు బయట ఉన్నాను చెల్లె నువ్వే రాలేదు అని అంటుంది. ఏంటక్కా నువ్వు నన్ను మోసం చేసావు నువ్వు నన్ను ఎత్తుకొని కదా తీసుకెళ్లాల్సింది అని అనగానే శ్రీవల్లి ప్రేమని ఎత్తుకొని బయటకు తీసుకెళ్తుంది. నాకు డాన్సులు సరిగ్గా రావు ఏం చేయమంటావో చెప్పు అని శ్రీవల్లి అంటుంది.. ఈరోజు నువ్వు డైలాగ్ చెప్పాలి అది కూడా నవరసాల్లో చెప్పాలి అని అనగానే శ్రీవల్లి ఏ రసం కావాలో చెప్పు ఆ రసంలో చెప్తానని అంటుంది.
ఎన్ని రసాలు వచ్చు అని ప్రేమ అడుగుతుంది. టమోటా రసం, కొత్తిమీర రసం, పుదీనా రసం, రసం ఇలా అన్ని రసాలు నాకు వచ్చు అని శ్రీవల్లి అనగానే ప్రేమ ఆ రసాలు కాదు నవరసాలు అని అంటుంది.. ప్రేమ ఒక డైలాగ్ ఇస్తుంది. తన గురించి తానే తిట్టుకుంటూ చెప్పడంతో శ్రీవల్లి దీనిని నేను చెప్పాలా అని అనుకుంటుంది. చెప్తావా నా కత్తి నీ మెడలోకి దిగిపొమ్మంటావా అని ప్రేమ మళ్ళీ అనడంతో శ్రీవల్లి చెప్తాను అని అంటుంది. ఇక శ్రీవల్లి ప్రేమ ఎలా చెప్తే అలా అన్ని రసాల్లో ఆ డైలాగ్ ని చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. ప్రేమ మాత్రం డైలాగ్ పేరుతో శ్రీవల్లిని ఒక ఆట ఆడుకుంటుంది. నేను చెప్పలేని సెల్లాయని శ్రీవల్లి కుప్పకూలిపోతుంది.
లోపలికి వెళ్ళిన ప్రేమ నేను ఇప్పుడు పడుకోవాలి అని చాప మీద పడుకో పోతుంది. కానీ ధీరజ్ చూసి ఎంత అందంగా ఉన్నాడో నా ప్రిన్స్ అంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది. చిన్నప్పుడు నుంచి నువ్వంటే కోపం.. నా పరువు కాపాడేందుకు నువ్వు మాట్లాడినా మాటలు నీపై కోపాన్ని చంపేసి ప్రేమను పుట్టించాయి.. అందుకే నువ్వంటే పడి చచ్చిపోతున్నాను అని ప్రేమ ధీరజ్ దగ్గర అంటుంది.. ధీరజ్ నిద్రపోతుంటే తనలో తనే మాట్లాడుకుంటూ నువ్వు ముద్దు పెట్టావా లేదా అంటూ ధీరజ్ నీకు గిల్లి మరి అడుగుతుంది. మొత్తానికి ధీరజ్ నిద్రలేచి ఎవరబ్బా కొడుతున్నారు ఎవరు గిల్లినట్లు అనిపిస్తుంది అని అనుకుంటాడు. రెండుసార్లు అలాగే అనిపించడంతో ప్రేమ ఇదంతా చేసింటుందని లేచి కూర్చుంటాడు. ప్రేమ ధీరజ్ కి దొరికిపోతుంది.
Also Read : శ్రీయ తిక్క కుదిర్చిన కమల్.. ఇంట్లో దీపావళి సంబరాలు.. అవనిని అవమానించిన పల్లవి..
నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని ప్రేమ ఎంత అడిగినా ధీరజ్ చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. చీర మార్చుకుని వచ్చిన ప్రేమ యేల యేలా పాటకు డ్యాన్స్ వేస్తుంది. వేదవతి నర్మద ఇద్దరు నిద్రలేచి ప్రేమ కొంప ముంచేలా ఉంది అని బయటకు వస్తారు. ప్రేమతో కలిసి ముగ్గురు అదిరిపోయే డాన్స్ వేస్తారు.. వాళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళ భర్తలతో డాన్సులు వేస్తారు. ధీరజ్ తో ప్రేమ డాన్స్ వేయిస్తుంది. అరె ధీరజ్ నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా అని అడుగుతుంది. నీకు నేను ముద్దు పెట్టలేదే అని అనగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..