E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయ తిక్క కుదిర్చిన కమల్.. ఇంట్లో దీపావళి సంబరాలు.. అవనిని అవమానించిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: శ్రీయ తిక్క కుదిర్చిన కమల్.. ఇంట్లో దీపావళి సంబరాలు.. అవనిని అవమానించిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode October 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని వెళ్లిన లాయరు చక్రధర్ కి ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్తాడు. ఇప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి చక్రధర్ టెన్షన్ పడుతూ కనిపించడంతో ఏమైంది డాడీ అని అడుగుతుంది.  మన సమస్య నాకు సీరియస్గా అనిపిస్తుంది అని చక్రధర్ అంటాడు. రాజేశ్వరి ఈయన టెండర్ వెయ్యాలని వెళ్లాలనుకున్నాడు కానీ వెళ్ళలేదు ఏమయింటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వీళ్లిద్దరూ మాట్లాడుకోవడం చూసినా రాజేశ్వరి ఏదో తప్పు జరుగుతుంది అని అనుకుంటుంది. మీ సమస్యలను తీసుకొచ్చి నా దగ్గర పెడతావు వాటిని తీర్చాలంటే నాకు ఇది అయిపోతుంది. నీవల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని పల్లవి పై చక్రధర్ సీరియస్ అవుతాడు..శ్రీయ మా బెడ్ రూమ్ లో పెట్టుకొని చూసుకోవడానికి నేను టీవీ ఆర్డర్ పెట్టాను అని అంటుంది. నాకు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి ఏమీ లేదు అందుకే టీవీ పెట్టుకుని నాకు ఇష్టం వచ్చిన ఛానల్ని చూసుకుందామని అనుకున్నాను అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లో టీవీ కొన్నందుకు అందరూ కలిసి పెద్ద రచ్చ చేస్తారు. కానీ శ్రీకర్ మాత్రం శ్రియా కి సపోర్ట్ చేస్తాడు. నా భార్య ఏది చేసినా అది కరెక్టే నా భార్యను ఎవరేమన్నా నేను అసలు ఊరుకోను అని అంటాడు. తన భర్తని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లిన తర్వాత శ్రియా నాకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అండి అని అవని అంటుంది. ఇక శ్రీయ మనం కొత్త టీవీని ఓపెన్ చేసి ఇష్టమైన ఛానల్ పెట్టుకుని చూద్దామని అంటుంది. ఇద్దరు కలిసి రాతిరి టీవీ పెట్టుకుని పెద్దగా సౌండ్ పెట్టి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. వీళ్ళ సౌండ్ కి లేచిన కమల్ ఇంట్లో అందరూ పడుకున్నారు ఆ మాత్రం మీకు బుద్ధి లేదా అని అంటాడు. మాటీవీ మా ఇష్టం మా గదికి రావాల్సిన అవసరం నీకేంటి అని శ్రియ అంటుంది. నువ్వు ముందు ఇకనుంచి వెళ్ళు అని శ్రేయ కమల్ తో సీరియస్గా అంటుంది.

Advertisement

ఇంట్లో మన ఇష్ట ప్రకారం ఉండమని తీసుకొచ్చారు కానీ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు చూసావా నీ తమ్ముడిని.. ఎంత సీరియస్ గా అంటే వెళ్ళిపోయాడు. ఇకమీదట నుంచి అందరితో మాట్లాడాలి అప్పుడే మన జోలికి ఎవ్వరూ రారు అని శ్రియ శ్రీకర్ తో అంటుంది.. నీ తమ్ముడు కోసం మన మూడునెందుకు ఖరాబ్ చేసుకోవాలి. మళ్లీ మనిద్దరం కలిసి డాన్స్ చేద్దాం పద అని శ్రియ అంటుంది. ఎక్కువ సౌండ్ పెట్టి డాన్స్ చేయడంతో కమల్ నిద్ర డిస్టర్బ్ అవుతుందని ఆ రూమ్ కి ఏకంగా పవర్ కట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్న సమయంలో కరెంటు పోవడంతో షాక్ అవుతారు. మనం సంతోషంగా ఉన్న టైంలోనే కరెంటు పోయిందేంటి చూద్దాం పదనేసి బయటికి వెళ్తారు.

బయట ఇంట్లో అంతా కరెంటు ఉండడం చూసి షాక్ అవుతారు. ఏంటి అంత కరెంటు ఉంది మన గదిలోనే పోయింది చూడు వెళ్లి అని శ్రీకర్ శ్రీయ అంటుంది. నాకు కరెంటు సంబంధించినవి ఏమీ తెలియదు శ్రియ అని శ్రీకర్ అంటాడు. కమల్ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. అయితే వాళ్ళిద్దరూ కలిసి కమల్ నిద్ర లేపుతారు.. మాగది మా టీవీ మా ఇష్టం అని అన్నారు కదా ఇప్పుడు నా నిద్ర నా ఇష్టం మీరు వెళ్ళండి అనేసి కమల్ పడుకుంటాడు. ఇక భార్యాభర్తలిద్దరూ విసురుకుంటూ దోమలతో యుద్ధాలు చేస్తూ అలానే పడుకుంటారు. ఉదయం లేవగానే ఆరాధ్య బయట అందరూ బాంబులు పేలుస్తున్నారు కదా నానమ్మ ఏంటి స్పెషల్ అని అడుగుతుంది.

Advertisement

దీపావళి పండుగ కదమ్మా అందరూ బాంబులు తెచ్చుకున్న వాళ్ళు రెండు మూడు రోజులు కాలుస్తూ ఉంటారు అని చెప్తుంది. మనము ఇప్పుడు దీపావళి పండుగ జరుపుకునే పరిస్థితిలో లేము కదమ్మా అని రాజేంద్రప్రసాద్ అనగానే అవని మనం కూడా దీపావళి పండుగని జరుపుకుందాం అని అంటుంది. అంటే అది కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు పండగ జరుపుకోవడానికి ఎలా వచ్చాయి అమ్మ అని వాళ్ళు అడుగుతారు. లేదు మావయ్య మాకు ఆఫీసులో దీపావళి బోనస్ ఇచ్చారు దాంతో నేను బట్టలు కొనేశాను ఇంటికి సంబంధించిన పూజ సామాన్లు కూడా కొనేశాను బాంబులు కూడా కొనేశాను అని అవని అంటుంది.

ఇంట్లో అందరిని పిలిచి బట్టలు ఇవ్వాలని అవని అనుకుంటుంది. భానుమతి ఇంట్లోని వాళ్ళందరినీ బయటకు రమ్మని పిలుస్తుంది. అయితే పల్లవి ఏంటి పొద్దు పొద్దున్నే అలా కేకలేస్తున్నావు అని అరుస్తుంది. భానుమతి మీ అందరికీ దీపావళి పండక్కి బట్టలు తీసుకొచ్చింది అవని అని చెప్పగానే ఇంటి అద్ద కట్టడానికి డబ్బులు లేవు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అడుగుతుంది పల్లవి.. ఇంటి అడ్డు కట్టేసింది మీ అందరికీ బట్టలు కూడా తీసుకొచ్చింది అని అనగానే అందరూ సంతోషపడతారు. పల్లవి శ్రీయాలు మాత్రం వాళ్లకు ఇచ్చిన చీరలు బాగోలేవంటూ వంక పెడతారు..

Also Read : ‘అఖండ 2’ నుంచి బిగ్ లీక్… హిందూపురం ఎమ్మెల్యే పాత్రలో బాలయ్య

ఇవన్నీ ఎందుకు వెళ్లి మీరు స్నానాలు చేయండి పూజ మొదలు పెడదామని భానుమతి అంటుంది. అయితే పూజకి అంత సిద్ధం చేసి పంతుల్ని పిలిచిన తర్వాత.. లక్ష్మీదేవి రూపు లేకుండా పూజ చేయడం ఎలా అని పల్లవి అవనీని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాత్రం తెలియకుండానే ఇంత గొప్పగా పూజ చేయాలని అనుకోవడం ఏంటి అని పల్లవి శ్రియ ఇద్దరు కూడా సందు దొరికితే అవనిపై పడిపోతుంటారు. అప్పుడే అవనీని బయట నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళగానే షాప్ లో బట్టలు తీసుకున్నారు కదా మేడం మీకు లక్ష్మీదేవి రూప్ ని గిఫ్ట్ గా ఇచ్చారు అని అనగానే అవని సంతోషపడుతుంది. ఆ రూపును తీసుకొచ్చి పూజలో పెట్టమని పంతులుగారికి ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×