తక్కువ ధరలకే టికెట్లు అందించడంలో ముందుంటుంది దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్. ఎప్పటికప్పుడు ప్రయాణీకులను ఆకట్టుకునేలా సరికొత్త ఆఫర్లను అందిస్తుంది. ఆయా అకేషన్స్ తో పాటు స్పెషల్ ఆఫర్ల పేరుతో వీటిని అందుబాటులో ఉంచుతుంది. అందులో భాగంగానే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ను పరిచయం చేసింది. కేవలం రూపాయికే విమాన టికెట్ అందిస్తోంది. ఇంతకీ ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటి వరకు విమాన ప్రయాణీకులను అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆఫర్లు ప్రకటించగా, ఇప్పుడు కేవలం చిన్న పిల్లల పేరెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో స్పెషల్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం రూపాయికే చిన్నారులకు విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది.
0-24 నెలల వయసు ఉన్న పసి పిల్లలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వారంతా కేవలం రూపాయికే ఫ్లైట్ జర్నీ చేయవచ్చు. అయితే, ఇండిగో విమానయాన సంస్థకు చెందిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ ను అందిస్తున్నట్లు తెలిపింది.
రూపాయితో విమాన టికెట్ కొనుగోలు చేసిన పేరెంట్స్.. విమానాశ్రయంలో చెకిన్ సమయంలో పిల్లల వయసును తెలిపే డాక్యుమెంట్స్ ను చూపించాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్, హాస్పిటల్ డిశ్చార్ట్ కార్డ్, టీకా వేయించిన సర్టిఫికేట్, పాస్ట్ పోర్ట్, లాంటి పత్రాల్లో ఏదో ఒకదాన్ని చూపిస్తే సరిపోతుంది. పిల్లల వయసును కన్ఫార్మ్ చేసే సరైన సర్టిఫికేట్లు చూపించకపోతే టికెట్ పూర్తి మొత్తాన్ని పే చేయాల్సి ఉంటుందని విమానయాన సంస్థ వెల్లడించింది.
Read Also: విమానం గాల్లో ఉండగా ఫ్యూయెల్ లీక్..భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!
ఇక ‘ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1’ పేరుతో స్పెషల్ ఆఫర్ కేవలం దేశీయ విమానాల్లోనే అందుబాటులో ఉంటుంది ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు చెల్లుబాటు అవుతుందని ఇండిగో తెలిపింది. ఎయిర్ బస్ విమానాల్లో 12 మంది వరకు పసి పిల్లలు వెళ్లే అవకాశం కల్పిస్తోంది. మిగతా విమానాల్లో ఆరుగురు శిశువులకు మాత్రమే అనుమతి ఉంది. విమానంలో ఒక వ్యక్తితో ఒకేపాప ఉండాలని సూచించింది. పసిపిల్లలతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుందని, అందుకే వారికి తమ సపోర్టు అందిస్తున్నట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణం చేసే సమయానికి మూడు రోజుల వయసు నుంచి రెండేళ్లలోపు వయసున్న పిల్లలు ఆ ఆఫర్ లో భాగంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: వామ్మో.. ఇండియన్ రైల్వే రోజు ఇన్ని టికెట్లు అమ్ముతుందా? ఆదాయం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!