After Brushing: మనలో చాలామంది ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఎవరో చెప్పారనో, గొంతులో ఏవైన తిన్న పదార్థాలు ఉంటే శుభ్రం అవుతాయని నమ్మకం. ఇది ఒక ఆచారంగా, అలవాటుగా మారిపోయింది. కానీ వైద్య నిపుణులు చెబుతుంది మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఇలా చేయడం వల్ల శరీరానికి ఉపయోగం ఏమీ లేదు, అంతేకాకుండా ఇలా చేయండి గొంతు ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు.
ఎందుకు ఇలా చేస్తారు?
కొంతమంది ఇలా చేస్తే జీర్ణక్రియ బాగుంటుందని, కడుపు శుభ్రం అవుతుందని నమ్మేవారు. మరికొందరు దీన్ని ఒక రకమైన యోగా ప్రక్రియతో కలిపి చెప్పేవారు. కానీ అందరికీ తెలిసిన యోగాసనాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి గానీ, ఇంట్లోనే మన ఇష్టం వచ్చినట్టు గా నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేయడం సరికాదు.
వైద్యులు ఏమంటున్నారు?
బ్రష్ చేసిన వెంటనే చేతులు నోట్లో పెట్టుకుని వాంతి చేయడం వల్ల గొంతులో ఉండే సున్నితమైన నరాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దాంతో అవి చిట్లిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే వాంతి చేసే సమయంలో పేగులపై, కడుపుపై బలమైన ఒత్తిడి పడుతుంది. ఇది తరచూ చేస్తే కడుపు కండరాలు బలహీనమవుతాయని వెల్లడించారు. చివరికి హెర్నియా వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని తెలిపారు
Also Read: Oppo Offers: ఒప్పో దీపావళి 2025 ఆఫర్లు వచ్చేశాయి.. స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు
గొంతు సమస్యలు
ప్రతి రోజు ఇలా వాంతి చేస్తే గొంతు ఎప్పుడూ ఇన్‌ఫర్మేషన్‌లలోకి వెళుతుందు. అంటే గొంతు ఎర్రగా, నొప్పిగా మారుతుంది. కొంతకాలానికి తర్వాత మన గొంతు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉంది. పాటలు పాడేవాళ్లు, ఎక్కువ మాట్లాడాల్సిన వాళ్లకు ఇది మరింత ప్రమాదకరంగా మారవచ్చు.
కడుపుపై ప్రభావం
అలా ఉదయాన్నే వాంతి చేస్తే కడుపులో ఉన్న ఆమ్లాలు తిరిగి గొంతులోకి వస్తాయి. దీన్ని యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. ఇది ఎక్కువ రోజులు జరిగితే గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్లు వచ్చే అవకాశముంది. కొందరికి పళ్ల మీద కూడా ఈ ఆమ్లం ప్రభావం చూపించి పళ్లు చెడిపోతాయి.
హెర్నియా ప్రమాదం
డాక్టర్లు ముఖ్యంగా హెచ్చరిస్తున్నవి హెర్నియా గురించి. తరచూ వాంతి చేసుకుంటే కడుపులోని కండరాలపై అధిక ఒత్తిడి పడుతుంది. అలా జరిగితే కండరాలు బలహీనపడి, లోపలి అవయవాలు బయటకు రావడం మొదలవుతుంది. దీనినే హెర్నియా అంటారు. ఇది చిన్న సమస్య కాదు, సర్జరీ చేయాల్సిన స్థితి వస్తుంది.
పరిష్కారం ఏమిటి?
బ్రష్ చేసిన తర్వాత నోట్లో వేళ్లు పెట్టడం మానేయాలి. దాని బదులుగా రోజూ ఎక్కువగా నీరు తాగాలి. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తింటే సహజంగానే శరీరం శుభ్రం అవుతుంది.
ఉపయోగం ఉండదు!
బ్రష్ చేసిన వెంటనే వాంతి చేయడం ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. బదులుగా గొంతు, కడుపు, పేగులకు హాని చేస్తుంది. ముఖ్యంగా హెర్నియా వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఇలాంటి పద్ధతులను పాటించడం మానేయాలి. సహజమైన అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, నీటిని ఎక్కువగా తాగడం ఇవే శరీరాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.