BigTV English

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Advertisement

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై హైమా రెడ్డిఅనే ప్రత్యక్ష సాక్షి కీలక విషయాలు వెల్లడించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సు తగలబడుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లాను. కాలిపోతున్న బస్సులో ప్రయణాకుల అస్తిపంజరాలు, మాంసపు ముద్దలను చూసి తట్టుకోలేకపోయాను. వెంటనే కర్నూలు ఎస్పీకి ఫోన్ చేశాను అని పేర్కొన్నారు.


కాగా.. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆతర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు సజీవదహనం అయ్యారు. ఎమర్జెన్సీ డోర్‌ నుంచి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లు తెలుస్తోంది. 20 మంది వరకు దుర్మరణం చెందినట్లు సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదం జరగడంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.


Also Read: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరిందని.. కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. గమనించిన డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను నిద్రలేపాడు. చిన్న ప్రమాదమనుకుని వాటర్‌ బబుల్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. మంటలుఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్రలేపారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి కొందరు బయటపడ్డారు. డ్రైవర్‌, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.

 

Related News

Jagan Sharmila: జగన్ కంటే షర్మిల బెటర్.. కనీసం జనంలోకి వస్తున్నారు

Kurnool Bus Accident: కర్నూల్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు, ఇప్పుడెలా?

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Big Stories

×