BigTV English

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు, ఇప్పుడెలా?

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు, ఇప్పుడెలా?
Advertisement

Kurnool Bus Incident: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్ బస్సు ఘటన‌లో ఏం జరిగింది? తప్పెవరిది? బస్సు డ్రైవర్‌ది తప్పా? బైక్ వాడిది తప్పా? లోతుగా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. అయితే ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.


హైదరాబాద్ నుంచి ఎప్పుడు మొదలు

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో 20 మంది జాడ కనిపించలేదు. ఇప్పటి వరకు కేవలం 12 మంది పేర్లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. మిగతా వారెక్కడ? ఘటన విషయం తెలియగానే వారి వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. బస్సులో ఏయే ప్రాంతాల నుంచి ఎంతమంది ఎక్కారు?


మూసాపేట్ నుండి రాత్రి 9.30 కి స్టార్ట్ అయ్యింది ట్రావెల్ బస్సు. ఆరంఘడ్ చౌరస్తాకు వచ్చేసరికి రాత్రి 11 గంటలు అయ్యింది.  అప్పటికి బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.  కూకట్‌పల్లి నుండి ఆరుగురు ప్రయాణికులు ఆ బస్సు ఎక్కారు. అలాగే కుత్బుల్లాపూర్ నుండి నలుగురు, ఎస్ఆర్ నగర్ నుండి ముగ్గురు, ఎర్రగడ్డ నుండి ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. అలాగే మూసా పేట్, వనస్థలిపురం, ప్యారడైజ్, లకడికపూల్ నుండి ఇద్దరేసి ప్రయాణికులు ఉన్నారు. భరత్ నగర్ నాంపల్లి, ఎల్బీ‌నగర్ ఒకొక్కరు ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనపై నోరెత్తని బస్సు యాజమాన్యం

హైదరాబాద్ నుంచి ఓల్వో బస్సు మూడు గంటలు ఆలస్యంగా బయలు దేరినట్లు నివేదికలు బట్టి తెలుస్తోంది. ప్రమాదానికి ముందు వి కావేరీ ట్రావెల్స్ బస్సు పుల్లూరు టోల్గేట్ దాటుతున్న  సీసీ కెమెరా దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ట్రావెల్ బస్సు గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వారంతా నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ కుటుంబసభ్యులుగా తెలుస్తోంది.

ఆ బస్సు ఫిట్నెస్ గడువు ముగిసిందని తేలింది. అంతేకాదు ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయిందని అంటున్నారు. ఇదేకాకుండా టాక్స్ కూడా గతేడాది‌తో ముగిసిందని కొందరు చెబుతున్నారు. ఇక పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన గురించి చెప్పనక్కర్లేదు. దాదాపు రూ.23,120 విలువ చేసే పెండింగ్ చలాన్లు ఉన్నాయి.

ALSO READ: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దగ్ధమైన బస్సు

ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు బస్సు యాజమాన్యం. శుక్రవారం ఉదయం పటాన్‌చెరులో ట్రావెల్ బస్సు ఆఫీసుకి పోలీసులు వెళ్లారు. ఇంకా ఆఫీసు తెరవలేదు సిబ్బంది. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పుడే ఆ ట్రావెల్‌కి చెందిన బస్సులు ఆఫీసుకు చేరుకుంటున్నాయి.

ప్రమాద స్థలాన్ని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్‌ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయినట్టు తెలిపారు. ఆ సమయంలో మంటలు చెలరేగి బస్సు దగ్దమైనట్టు పేర్కొన్నారు. 20 మంది ప్రయాణికులు మిస్‌ అయ్యారని, ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికి తీశామని వెల్లడించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడని, 20మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్టు చెప్పుకొచ్చారు జిల్లా కలెక్టర్ సిరి.

బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాల సభ్యులు కింది నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు.

కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నెంబర్- 08518-277305
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101059
ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101061
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 9121101075
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నెంబర్లు: 9494609814, 9052951010

 

 

 

Tags

Related News

Jagan Sharmila: జగన్ కంటే షర్మిల బెటర్.. కనీసం జనంలోకి వస్తున్నారు

Kurnool Bus Accident: కర్నూల్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Kurnool Bus Tragedy: సీట్లలో అస్థిపంజరాలు.. మాంసపు ముద్దలు.. కళ్లకు కట్టినట్లు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షి, ప్రయాణికుడి మాటల్లో

Kurnool Bus Incident: కర్నూలు బస్సు ఘటన.. అత్యంత విషాదకరమన్న సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నాలుగైదు రోజులు భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

Tiruvuru Row: తిరువూరు వ్యవహారంపై సీఎం సీరియస్.. చంద్రబాబే స్వయంగా రంగంలోకి.. వేటు తప్పదా?

Big Stories

×