Gautam Gambhir: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓడిపోయిందని ఫైర్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ కోచ్గా నియామకమైన నుంచి ఇప్పటివరకు టీమిండియా 5 సిరీస్ లు కోల్పోయిందని ట్రోలింగ్ చేస్తున్నారు. నిన్న టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో గిల్ సేన దారుణంగా ఓడిపోయింది. దీంతో 2-0 తేడాతో టీమిండియా సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది.
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటీ నుంచి ఇప్పటి వరకు విజయాల కంటే ఓటములే ఎక్కువ నమోదయ్యాయి. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఇటీవల గెలిచినప్పటికీ.. ఏకంగా 5 కీలక సిరీస్ లను టీమిండియా కోల్పోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనంతటికీ గౌతమ్ గంభీర్ కారణమని అతన్ని విలన్ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ ను గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలోని భారత్ కోల్పోయింది. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ టీం ఇండియా టెస్ట్ సిరీస్ కూడా మనోళ్లు కోల్పోయారు. అటు 4-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ డ్రాగ ముగించుకుంది. అలాగే తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా.
ఆస్ట్రేలియా గడ్డపై గౌతమ్ గంభీర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ ను ఒక్క వన్డేలో కూడా ఆడించలేదు గౌతమ్ గంభీర్. అతను ఆడి ఉంటే మ్యాచ్ స్వరూపం మారిపోయేది. అదే ఆస్ట్రేలియా మాత్రం అడం జంపా లాంటి స్పిన్నర్ ను ఆడించి సక్సెస్ అయింది. వాషింగ్టన్ సుందరకు అవకాశం ఇవ్వకుండా కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంటే టీం ఇండియా గెలిచేదని అంటున్నారు. హర్షిత్ రాణాను ( Harshit Rana) ప్రతి మ్యాచ్ లో ఆడించడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతని స్థానంలో బుమ్రాను జట్టులో తీసుకుంటే సరిపోయేదని అంటున్నారు. వెస్టిండీస్ జట్టుపై జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుమ్రాను ఆడించారు. కానీ కీలకమైన ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డే సిరీస్ కు మాత్రం అతన్ని దూరం చేశారని అంటున్నారు. ఇక తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించి, శుభమన్ గిల్ కు అవకాశం ఇచ్చారు. దీని వల్ల సిరీస్ మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. అటు గిల్ కు కెప్టెన్సీ చేయడం రాదని అంటున్నారు.
Gautam Gambhir as India Coach:
•Lost ODI series vs Sri Lanka
•Lost home Test series vs New Zealand
•Lost BGT 4-1
•Draw against a subpar England side
•Lost ODI series vs an average Australian team
•Made undeserving Gill captainWorst coach ever. Sack him immediately. 🤡 pic.twitter.com/2prGSGJZ8y
— Rohan💫 (@rohann__45) October 23, 2025