Nubia Z80 Ultra| స్మార్ట్ ఫోన్ కంపెనీ ZTE తాజాగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ న్యూబియా Z80 అల్ట్రాను విడుదల చేసింది. ఇది 6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, అతి వేగవంతమైన టచ్ సాంప్లింగ్, కళ్లకు రక్షణ నిచ్చే టెక్నాలజీలతో లాంచ్ అయింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 16GB వరకు RAM, 1TB స్టోరేజ్ ఉన్నాయి. 7,200mAh బ్యాటరీ, AI కెమెరా సిస్టమ్, ప్రొ-లెవల్ గేమింగ్ ఫీచర్లతో పూర్తి ఫ్లాగ్‌షిప్ అనుభవం ఇస్తుంది.
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్తగా విడుదలైన న్యూబియా Z80 అల్ట్రా ఫీచర్లు.. నేరుగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మధ్య గట్టి పోటీనిస్తోంది. రెండూ హై-ఎండ్ ఫోన్‌లు, కానీ న్యూబియా సగం ధరలో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. రెండు ఫోన్ల మధ్య పోలిక చూద్దాం.
గెలాక్సీ S25 అల్ట్రా: 6.9 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. న్యూబియా Z80 అల్ట్రా: 6.85 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అండర్-డిస్‌ప్లే సెల్ఫీ కెమెరాతో ఫుల్-స్క్రీన్ లుక్ ఉంటుంది.
న్యూబియా పై చేయి.. ఎక్కువ రిఫ్రెష్ రేట్, ఫుల్-స్క్రీన్ డిజైన్ గేమింగ్, వీడియోలకు అద్భుతంగా ఉంటుంది.
రెండు ఫోన్‌లూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌తో వస్తాయి, ఇది అత్యంత వేగవంతమైన ప్రాసెసర్. న్యూబియా మెరుగైన కూలింగ్ టెక్నాలజీని జోడించవచ్చు, దీనివల్ల పనితీరు బాగుంటుంది. రెండూ మల్టీటాస్కింగ్, గేమింగ్, మీడియాకు సులభంగా పనిచేస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా కంటే న్యూబియా చాలా తక్కువ ధరలో అద్భుతమైన పనితీరు అందిస్తుంది.
గెలాక్సీ S25 అల్ట్రా: 200MP మెయిన్ కెమెరా, అధునాతన టెలిఫోటో, అల్ట్రా-వైడ్ లెన్స్‌లు.
న్యూబియా Z80 అల్ట్రా: 50MP + 64MP + 50MP ట్రిపుల్ కెమెరాలు, 50x హైబ్రిడ్ జూమ్, 15cm దూరంలో మాక్రో ఫోటోలు.
జూమ్ మాక్రో ఫోటోగ్రఫీలో న్యూబియా అద్భుతంగా రాణిస్తుంది.
గెలాక్సీ S25 అల్ట్రా: 5,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్.
న్యూబియా Z80 అల్ట్రా: 7,100mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
ఎక్కువ బ్యాటరీ లైఫ్, వేగవంతమైన ఛార్జింగ్ తో న్యూబియా ముందుంజలో ఉంది.
గెలాక్సీ S25 అల్ట్రా: బెండ్ కార్నర్స్.. మెటల్ ఫినిష్‌తో శాంసంగ్ ప్రీమియం లుక్ లో ఉంటుంది.
న్యూబియా Z80 అల్ట్రా: లైట్ వైట్, ఫాంటమ్ బ్లాక్, స్టారీ స్కై ఎడిషన్‌లతో సొగసైన డిజైన్. అండర్-డిస్‌ప్లే కెమెరాతో ఫ్యూచరిస్టిక్ లుక్‌నిస్తుంది.
ఫుల్-స్క్రీన్ డిజైన్, ఆకర్షణీయ రంగులతో న్యూబియా లుక్ కొంచెం బెటర్.
గెలాక్సీ S25 అల్ట్రా: ఖరీదైన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ధర. దీని ప్రారంభ ధర రూ.1,35,499.
న్యూబియా Z80 అల్ట్రా: సగం ధరలో సమానమైన లేదా మెరుగైన ఫీచర్లు ఉన్నాయి. దీని బేసిక్ వేరియంట్ ధర చైనాలో 12GB + 512GB వేరియంట్ CNY 4,999 (సుమారు రూ.61,600). అంటే శాంసంగ్ కంటే 50 శాతానికి పైగా తక్కువ. అతి తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సాఫ్ట్‌వేర్, కెమెరా ప్రాసెసింగ్, పెద్ద బ్రాండ్ విశ్వసనీయతలో ముందుంది. కానీ న్యూబియా Z80 అల్ట్రా ఎక్కువ రిఫ్రెష్ రేట్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరాలను తక్కువ ధరలో అందిస్తుంది. ఫ్లాగ్‌షిప్ పనితీరు, డిజైన్ కావాలంటే, న్యూబియా Z80 అల్ట్రా స్మార్ట్ ఎంపిక.
Also Read: : ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?