Bigg Boss 9: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో 9వ సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకోగా.. ఏడవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పచ్చళ్ళ పాపను బయటకు పంపించడానికి ఇంకొకరికి ఓట్లు తెగ గుద్దేశారు ఆడియన్స్. అలా లాస్ట్ మూమెంట్లో వోటింగ్ లో భారీగా తారుమారు జరిగింది. మరి పచ్చళ్ళ పాప రమ్యపై కోపం పెరగడానికి కారణం ఏమిటి? ఈమె వల్ల ఎవరు సేఫ్ అయ్యారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఇదిలా ఉండగా ఏడవ వారం నామినేషన్స్లోకి రాము రాథోడ్, రీతు చౌదరి, సాయి , తనూజ, రమ్య, కళ్యాణ్, సంజన, దివ్యా నికిత ఇలా మొత్తం 7 మంది నామినేషన్స్ లోకి వచ్చేసారు. బిగ్ బాస్ హౌస్ లో డేంజర్ కంటెస్టెంట్ గా ఉన్న పచ్చళ్ల పాప రమ్యను ఇంటికి పంపేందుకు జనం బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అటు ఆన్లైన్ పోల్ లో ఎక్కడ చూసినా రమ్య లీస్ట్ ఓటింగ్ లో ఉండడం గమనార్హం. ఇప్పటికే తనూజ 38% ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో కళ్యాణ్ 20% ఓట్లతో దూసుకుపోతున్నాడు. పైగా ఈ ఇద్దరి గురించే హౌస్ లో పుకార్లు నడుస్తుండగా..ఈ వారంలో ఈ ఇద్దరే టాప్ లో ఉండడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం. వీరిద్దరికి పోటీగా దివ్య నిఖిత కూడా 11% ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. వాస్తవానికి గత వారమే..ఈమె భరణి బదులు ఎలిమినేట్ కావాల్సింది కానీ భరణి ఎలిమినేట్ అవ్వడంతో ఈమె కాస్త సేవ్ అయింది. ఇక ఈ వారంలో టాప్ 3 లోకి వచ్చేసింది. దీనికి బలమైన కారణం పచ్చళ్ల పాప. నిజానికి దివ్యకి ఈ వారం లీస్ట్ ఓటింగ్ ఉన్నప్పటికీ పచ్చళ్ళ పాపని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపాలనే ఉద్దేశంతోనే చాలామంది దివ్యకి ఓట్లు వేసి ఆమెను మూడు స్థానంలో నిలబెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే పచ్చళ్ళ పాపపై కసి దివ్య నికితకు బాగా కలిసొచ్చేటట్టు కనిపిస్తోంది.
ALSO READ:OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?
నిజానికి ఓటింగ్ వల్ల కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న దమ్ము శ్రీజ, భరణి శంకర్లు అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో ఎవరిని ఉంచాలి? ఎవరిని పంపించాలి? అనేది ఆడియన్స్ నిర్ణయమని సోది కబుర్లు చెబుతారు కానీ అసలు తెరవెనుక బిగ్ బాస్ నిర్వాహకులు నడిపే తీరే అందరికి అర్థమవుతుంది. అందుకే ఓటింగ్ ను బట్టి వాళ్ళు వీళ్ళు ఎలిమినేట్ అవుతారని కాకుండా.. ఎవరిని బిగ్ బాస్ హౌస్ లో ఉంచాలని నిర్వాహకులు కోరుకుంటున్నారో.. వారు మాత్రమే హౌస్ లో కొనసాగుతారని చెప్పవచ్చు. మొత్తానికి అయితే పచ్చళ్ళ పాప ఓవరాక్షన్ తట్టుకోలేక ఆమెను బయటకు పంపించాలని గట్టి కసితో ఉన్నారు ఆడియన్స్. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.