Krithi Shetty: తక్కువ సినిమాలతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంది హీరోయిన్ కృతి శెట్టి.
బాలీవుడ్ మూవీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది ఈమె.
ఆ తర్వాత ఉప్పెనతో తెలుగు అభిమానులకు దగ్గరైంది.
ఇక వెనుదిరిగి చూడలేదు. వరసగా ఆఫర్లు వచ్చాయి.. బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి.
ఇదే క్రమంలో అప్పుడప్పుడు తమిళ సినిమాలు చేస్తూ వస్తోంది.
ఈ ఏడాది తెలుగులో ఒక్క ప్రాజెక్టు లేకపోయినా, తమిళంలో మాత్రం మూడింటికి కమిట్ అయ్యింది.
ఒకటి పోస్టు ప్రొడక్షన్ దశలో ఉండగా మరో రెండు సెట్స్‌పై ఉన్నాయి.
తెలుగులో అభిమానులను ఆకట్టుకునేందుకు వెరైటీగా ఫోటోషూట్ చేసింది దానిపై ఓ లుక్కేద్దాం.