గంగా నదిని చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు తప్పకుండా గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తారు. ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, మానసికంగా, శారీరకంగా పవిత్రంగా మారుతారని నమ్ముతారు. అయితే, తాజాగా ఓ ఫారిన్ పర్యాటకురాలు గంగా నదిలో స్నానం చేసిన ఘటన పెద్ద చర్చకు కారణం అయ్యింది. కొంత మంది ఆమెను సమర్థిస్తుండగా, మరికొంత మంది ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
తాజాగా ఓ ఫారిన్ టూరిస్ట్ ఇండియాకు వచ్చింది. ఆమె ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ కు వెళ్లింది. అక్కడ సదరు మహిళ బికినీ ధరించి, మెడలో పూలదండలు వేసుకుని నది ఒడ్డున నిలబడి నమస్కారం చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా నదిలోకి వెళ్లింది. తర్వాత ఆమె తన మెడలోని పూల దండలను నదిలోకి విసిరేసింది. ఆ తర్వాత కాసేపు ఈత కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Maa Ganga is a sacred river, not a beach or a swimming pool. Show respect wear decent attire, not a bikini. pic.twitter.com/KUbyVhw0u3
— Hindutva Vigilant (@VigilntHindutva) October 20, 2025
Read Also: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?
బికినీలో సదరు ఫారిన్ మహిళ గంగానదిలో స్నానం చేసిన వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది ఆమెను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొంత మంది ఆమెను సమర్థిస్తున్నారు. మొత్తంగా నెటిజన్లు రెండుగా విడిపోయిన ఈ ఘటనపై చర్చలు చేస్తున్నారు. “పవిత్ర గంగా నదిలో బికినీలో స్నానం చేయడం నిజంగా అభ్యంతరకరం. ఆలా చేసి ఉండకూడదు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఫారిన్ యువతి కాబట్టి ఇక్కడ ఆచారాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే, అలా చేసి ఉండవచ్చు. ఈ విషయం గురించి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. అనవసరంగా పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇందులో తప్పేముంది? మగాళ్లు ఇన్నర్ వేర్ తోనే అక్కడ స్నానం చేస్తారు. ఆ మహిళ కూడా అలాగే చేసింది. పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు” అని ఇంకో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “పవిత్ర గంగాలో ఇలా చేయడం మంచిది కాదు. ముందుగా సంప్రదాయాల గురించి తెలుసుకుని నడుచుకుంటే బాగుంటుంది” అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా గంగానదిలో ఫారిన్ మహిళ బికినీ స్నానం పెద్ద రచ్చకు కారణం అవుతుంది.
Read Also: అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?