Hyderabad News: బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? నేతలతోపాటు కార్యకర్తలు ఒత్తిడికి గురవుతున్నారా? కార్యకర్తలకు ఆమోదయోగ్యం కాని నిర్ణయాలను తీసుకుంటోందా? అందుకే కేడర్ తలో దారి చూసుకుంటోందా? ఉన్నట్లుండి ఆశాప్రియ ఎందుకు లైమ్ లైట్‌లోకి వచ్చింది? ఇంతకీ ఆమె ఎక్స్ వేదికగా ఏ రాసుకొచ్చారు? అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
ఆ పార్టీలో ఏం జరుగుతోంది?
బీఆర్ఎస్ పేరు చెప్పగానే కార్యకర్తల్లో ముందుగా వచ్చే పేరు ఆశా ప్రియ. యువ మహిళా నాయకురాలిగా మాంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ఆమెకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. కీలక నేతలను ఎవరైనా టార్గెట్ చేస్తే వెంటనే రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చేవారు. ఇదంతా ఒకప్పటి మాట. సరిగ్గా ఏడాది కిందట కారు పార్టీకి రాజీనామా చేసినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
పార్టీకి రాజీనామా చేసినా ఇంకా ఆ పార్టీతో తత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారట ఆమె. తాజాగా కొన్నిక్షణాల ముందు ఆమె ఎక్స్ వేదికగా కీలక కామెంట్స్ చేశారు. నా చావుకు కేటీఆర్, ఆ నేతలే కారణమని రాసుకొచ్చారు. ఆమె X వేదికగా చేసిన పోస్ట్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకొన్ని గంటల్లో ఎలాంటి పోస్ట్ రాకుంటే చచ్చిపోతానని, అందుకు సంబంధించిన ఆధారాలు నా whats app self chatలో ఉంటాయని పేర్కొన్నారు.
ఆశాప్రియ పోస్టు వెనుక
దీనివెనుక ఎవరు చేయిస్తున్నారు? అనేదానికి సమాధానం అక్కడ లభిస్తుందని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపులు గురించి తన మనసులోని మాటను బయటపెట్టారు. అదే నా మరణ వాంగ్మూలం అని రాసుకొచ్చారు. పార్టీ ఆఫీసుకు యువనేత వస్తే నందినగర్ లేకుంటే జూబ్లీహిల్స్ ఏదో ఒకటి తేల్చుకుంటానని ప్రస్తావించారు. దీనిపై పలువురు ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
క్యారెక్టర్ ఎవర్ని ఎవరు చంపేస్తున్నారని, ఎవరి ఆరాధన వారికి ఉంటుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆశాప్రియ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఆమెని పని గట్టుకుని వేధింపులకు గురి చేస్తున్నట్లు పెట్టిన పోస్టుల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ కావాలనే ఆమెని వేధిస్తున్నారా? అయినా జూబ్లీహిల్స్ బైపోల్ ముందు ఇదేమి లొల్లి అనేవారు లేకపోలేదు.
ALSO READ: కొండా ఎపిసోడ్‌లోకి బీఆర్ఎస్.. పావులు కదుపుతున్న రాజయ్య
మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ ఏమోగానీ ఆ పార్టీ ఆశాప్రియ గురించి చర్చ మొదలైనట్టు ఆ పార్టీ వర్గాల మాట. రానున్న రోజుల్లో ఆశాప్రియ ఇంకెన్ని విషయాలు బయటపెడుతుందో చూడాలి. ఇంతకీ ఎక్స్ అకౌంట్ ఆమెదా? లేకుంటే ఆమె పేరు మీద ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా?
నావు చావుకు కారణం PJMR ,HS, AND KTR HIMSELF
నా నుండీ ఇంకొన్ని గంటల్లో ఎలాంటి పోస్ట్ రాకుంటే చచ్చిపోయాను అని అర్థం ఆధారాలు నా whats app self chat లో ఉంటాయి
ఎవరు చేయిస్తున్నారు వెనుక ఉండి అనే ధానికి సమాధానం అక్కడ దొరుకుతుంది…అదే నా మరణ వాంగ్మూలం…
ఇప్పుడు పొయి కేసు పెట్టిన…
— AshaPriya Mudiraj 🇮🇳 (@ashapriya09) October 22, 2025