భారత్ లో ఇప్పుడు డిజటల్ పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు డిజిటల్ పేమెంట్స్ మోడ్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్ లో డిజిటల్ పేమెంట్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది పర్సులో మనీ క్యారీ చేయడమే మర్చిపోతున్నారు. ఎంత డబ్బు అయినా ఫోన్ ద్వారానే ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. చివరకు చాయ్ తాగినా, చాక్లెట్ తిన్నా.. రూ, 5, 10 కూడా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా మనీ పే చేస్తున్నారు. మొత్తంగా దేశంలో డిజిటల్ పేమెంట్స్ రెవల్యూషన్ అనేది కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో పలు UPI యాప్స్ భారతీయులు విదేశాల్లోనూ డిజిటల్ పేమెంట్స్ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత్ తో పాటు పలు దేశాలు కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ ను అనుమతిస్తున్నాయి. ఇంతకీ ఏ ఏ దేశాల్లో డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం..
UPI పేమెంట్స్ యాక్సెప్ట్ చేసే దేశాలు
UPI పేమెంట్స్ ఇప్పుడు భారత్ తో పాటు పలు పొరుగు దేశాలు, యూరోపియన్ కంట్రీట్స్ లోనూ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి డిజిటల్ పేమెంట్స్ యాప్స్. ప్రస్తుతం ఇండియన్ UPI యాప్స్ ద్వారా సింగపూర్, దుబాయ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఫ్రాన్స్, మారిషస్ లో కూడా పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. భారత్ లో ఎలా అయితే, UPIని ఉపయోగించి పేమెంట్స్ చేస్తున్నారో, అక్కడ కూడా అలాగే పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, విదేశాల్లో UPI పేమెంట్స్ చేయాలంటే యాప్ లో కొన్ని సెట్టింట్స్ చేస్తే సరిపోతుంది. ఈ సెట్టింగ్స్ కచ్చితంగా మార్చితేనే విదేశాల్లో డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆ సెట్టింగ్ ఏంటి? ఎలా మార్చాలంటే..
ఫోన్ పేలో మార్చాల్సిన సెంట్టింగ్స్
⦿ ముందుగా ఫోన్ పే యాప్ ఓపెన్ చేయాలి.
⦿ ప్రొపైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
⦿ కిందికి స్క్రోల్ చేస్తే ఇంటర్నేషనల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.
⦿ అప్పుడు మన బ్యాంక్ అకౌంట్స్ వివరాలు కనిపిస్తాయి. మీరు విదేశాల్లో ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్స్ చేయాలి అనుకుంటున్నారో ఆ బ్యాంక్ ను యాక్టివేట్ చేసుకోవాలి.
⦿ ఇక మీరు UPI యాప్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివేట్ చేస్తారో, ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి స్కాన్ చేసి విదేశాల్లో UPI ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.
గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ లో కూడా ఇంటర్నేషనల్ అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా విదేశాల్లో ఈజీగా పేమెంట్స్ చేసే అవకాశం ఉంటుంది. భారత్ లో ఎలా అయితే, క్యాష్ లెస్ పేమెంట్స్ చేస్తున్నారో, ఇతర దేశాల్లోనే అలాగే చేసే అవకాశం ఉంటుంది.