Asif Afridi: పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఆసిఫ్ ఆఫ్రిది (Asif Afridi) సంచలన రికార్డు సృష్టించాడు. 38 సంవత్సరాల వయసులో ఏకంగా 92 ఏళ్ల రికార్డును క్రియేట్ చేశాడు ఆసిఫ్ ఆఫ్రిది. పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో అరంగేట్రం చేసిన ఆసిఫ్ ఆఫ్రిది తన తొలి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే 92 సంవత్సరాల కిందట చార్లెస్ మారియట్ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు ఆసిఫ్ ఆఫ్రిది. తాజాగా దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు తీసి, ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. దీంతో ఆసిఫ్ ఆఫ్రిది (Asif Afridi) పేరు మారుమోగుతోంది. ఇప్పటివరకు అసిఫ్ అఫ్రిది 28 ఓవర్లు వేయగా 52 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇందులో 6 మెడిన్స్ కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( Pakistan vs South Africa, 2nd Test) మధ్య రావాల్పిండి ( Rawalpindi Cricket Stadium, Rawalpindi ) వేదికగా రెండో టెస్టు మొన్నటి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 333 పరుగులకు మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆసిఫ్ ఆఫ్రిది తన 35 సంవత్సరాల వయస్సులో టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా తన కంటే దాదాపు 12 సంవత్సరాలు చిన్న వాడైన షాహిన్ ఆఫ్రిది, ఆసిఫ్ కు టెస్ట్ క్యాప్ అందించాడు. ఇక ఈ నేపథ్యంలోనే మొదటి మ్యాచ్ లోనే ఆసిఫ్ ఆఫ్రిది ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. 92 సంవత్సరాల తర్వాత ఈ ఏజ్ లో ఈ రికార్డు సృష్టించడం తొలిసారి.
గతంలో ఇంగ్లాండ్ ఆటగాడు చార్లెస్ మారియట్ ( Charles Marriott) ఇదే రికార్డు క్రియేట్ చేశాడు. 1933 ఆగస్టు 12వ తేదీన వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో 37 సంవత్సరాల 332 రోజుల వయసు ఉన్న చార్లెస్ మారియట్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో రెండో రోజు మొదటి ఇన్నింగ్స్ లో 11.5 ఓవర్లు సంధించాడు చార్లెస్ మారియట్. ఈ సందర్భంగా 37 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆరు వికెట్లు పడగొట్టి 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చార్లెస్ మారియట్ తర్వాత ఇప్పుడు ఆసిఫ్ ఆఫ్రిది ఆ రికార్డు సృష్టించాడు. ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలోనే వన్డే కెప్టెన్ ను ప్రకటించి వివాదాలకు తరలిపోయింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. సక్సెస్ఫుల్ కెప్టెన్ గా ఉన్న మహమ్మద్ రిజ్వాన్ ను పక్కకు పడేసింది పిసిబి. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ షహీన్ ఆఫ్రిది పేరును ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
5 WICKETS HAUL FOR ASIF AFRIDI ON TEST DEBUT 🇵🇰
– A dream start for any bowler! He proved exactly why he deserved the cap👏🔥 pic.twitter.com/d26Bk6BWzV
— junaiz (@dhillow_) October 22, 2025