BigTV English

Non-venomous Snake: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!

Non-venomous Snake: విషం లేని పాములు కూడా ప్రమాదకరమా? అసలు విషయం తెలిస్తే వణికిపోతారు!
Advertisement

పాముల విషయం వినగానే చాలా మందికి తెలియని భయం కలుగుతుంది. అయితే, భూమ్మీద ఉన్న 70 శాతం పాములకు విషం అనేది ఉండదు. కొన్ని రకాల పాములకు మాత్రమే విషం ఉటుంది. కోబ్రా, వైపర్స్ లాంటి పాములు కాటేస్తే, మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే, విషం లేని పాములు మనుషులకు ఇబ్బంది కలిగిస్తాయా? అంటే.. అవును, అనే సమాధానం వినిపిస్తుంది. విషం లేని పాము విష గ్రంథులను కలిగి ఉండదు. కాటు ద్వారా విషాన్ని ఇంజెక్ట్ చేయదు. దానికి బదులుగా, ఇతర పద్దతుల ద్వారా హాని చేసే ప్రయత్నం చేస్తాయి.


ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం..  చాలా పాము జాతులు విషం లేనివి. ఇప్పటి వరకు గుర్తించిన 3,700+ పాము జాతులలో 70 శాతం కంటే ఎక్కువ పాములకు విషం ఉండదు. ఎలుకల జనాభాను నియంత్రించడం ద్వారా ఈ పాములు  పర్యావరణ వ్యవస్థలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  అయిఏ, ఈ పాములు నిర్దిష్ట పరిస్థితులలో మనుషులకు హాని కలిగిస్తాయి.

⦿ ఊపిరాడకుండా చేయడం  

బోయాస్, కొండచిలువ లాంటి విషం లేని పెద్ద పాములు ప్రమాద సమయంలో అవి ఆయా జంతువులు లేదంటే మనుషుల  చుట్టూ గట్టిగా చుట్టుకొని ఊపిరాడకుండా చేసి చంపుతాయి. మనుషుల పైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.  రెటిక్యులేటెడ్ కొండచిలువలు సుమారు 20 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి ఆగ్నేయాసియా, ఇండోనేషియాలోని కొన్ని ప్రాంతాలలో ఇవి మనుషుల చావుకు కారణం అయ్యాయి.


⦿ ఇన్ఫెక్షన్లు

విషం లేకపోయినా కొన్ని పాములు కాటు వేస్తాయి. ముఖ్యంగా వాటిని భయపెట్టిన సమయంలో ఇలా చేస్తాయి. కాటు విషపూరితం కాకపోయినా, చికిత్స చేయకపోతే అది చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దాని కారణంగా మనుషులు చనిపోయే అవకాశం ఉంటుంది.

⦿ జూనోటిక్ వ్యాధి ప్రమాదం

పాములు, అనేక సరీసృపాల మాదిరిగానే ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, వాటి చర్మంపై సాల్మొనెల్లాను కలిగి ఉంటాయి.  విషం లేని పామును పట్టుకుని, ఆ తర్వాత మీ నోటిని, లేదంటే ఫుడ్ ను తాడకం వల్ల బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అది మనిషికి ఎంతో ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.

Read Also: జీరా వాటర్, చియా సీడ్స్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే?

⦿ భయంతో కలిగే ప్రమాదం

అపాయం లేని పాములను చూసి భయాందోళనకు గురై చాలా మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఉదాహారణకు విషం లేని పాము నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు కార్లను ఢీకొట్టడం, పడిపోవడం, గుండెపోటు వచ్చి చనిపోయిన సందర్భాలున్నాయి.

కార్న్ స్నేక్స్, కింగ్ స్నేక్స్, బాల్ పైథాన్స్ లాంటి జాతులను సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులుగా ఇంట్లో ఉంచుకుంటారు. అయితే, నిపుణులు ప్రతి జాతి నిర్దిష్ట పరిమాణం, బలం, సంరక్షణ అవసరాలను అర్థం చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. విషం లేని పాములకు కూడా తప్పించుకోవడం, గాయపడకుండా ఉండటానికి సురక్షితమైన ఆవరణలు, జాగ్రత్తగా నిర్వహించడం అవసరం అన్నారు.

Read Also: జీరా వాటర్, చియా సీడ్స్.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్ అంటే?

Related News

Diwali Celebrations: కిలో మీటరు మేరకు పటాకులు పేల్చి బీభత్సం.. ఫ్యామిలీకి రూ.10 వేలు చందాలు వేసుకుని మరీ..

Foreign Tourist Trolled: గంగా నదిలో బికినీ స్నానం.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!

దీపావళి వేడుకల్లో 70 మందికి పైగా గాయాలు

Viral video: కోటలో ముస్లీం యువతుల నమాజ్.. బీజేపీ నాయకులు ఏం చేశారంటే?

Viral Video: ఏంటీ.. ఇది ఆస్ట్రేలియానా? దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారో!

Viral Video: జపాన్ భాష నేర్చుకుని.. ఏకంగా రూ.59 లక్షల సంపాదిస్తున్న ఇండియన్, ఇదిగో ఇలా?

Samosa Vendor Video: హ్యాండిచ్చిన యూపీఐ యాప్.. ప్రయాణికుడి కాలర్ పట్టుకున్న సమోసాల వ్యాపారి.. వీడియో వైరల్

Big Stories

×