Air India Flight: మరో ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులను వణికించింది. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన AI-119 ఫ్లైట్ బుధవారం ఉదయం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తింది.
ముంబై నుంచి బయల్దేరింది విమానం.. కాసేపటకే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దాంతో సముద్రంపైనే ప్లైట్ గంటకు పైగా చక్కర్లు కొట్టినట్టుగా తెలుస్తోంది. టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తిందంటూ ఫైలెట్స్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు. వారికి ఏం జరుగుతుందో తెలీక..సేఫ్‌గా ల్యాండ్ అవుతుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని విమానంలోనే కూర్చున్నారు ప్రయాణికులు.. కానీ కొద్దిసేపటి తర్వాత తిరిగి ముంబైలో సేఫ్‌గా ల్యాండింగ్ చేయడంతో.. ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇక మరికొంత ప్రయాణికులను ఇతర ఫ్లైట్‌లలో అడ్జెస్ట్ చేసి వారి గమ్య స్థానాలకు పంపించడం జరిగింది.
విమానం రన్‌వే పై దిగిన వెంటనే సాంకేతిక నిపుణుల బృందం పరిశీలన మొదలుపెట్టింది. నివేదికల ప్రకారం ఇంజిన్ సెన్సార్‌లో లోపం తలెత్తినట్లు భావిస్తున్నారు. దాంతో ఆటోపైలట్ వ్యవస్థ అసాధారణంగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి సాంకేతిక నివేదిక రాకపోవడంతో స్పష్టమైన కారణం ఇంకా తెలియరాలేదు.
ఈ సంఘటనతో ఎయిర్ ఇండియా విమానాల భద్రతా లోపాలపై మళ్లీ చర్చ మొదలైంది. గత కొద్ది నెలలుగా ఆ సంస్థకు చెందిన పలు అంతర్జాతీయ ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు నమోదవుతున్నాయి.
Also Read: ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ డ్రెస్.. దీని ఖరీదు ఎంతంటే..
ఈ తరహా సాంకేతిక సమస్యలతో ప్రయాణికులలో భయాందోళన పెరుగుతున్నదని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా.. తగిన జాగ్రత్తలు చేపడతామని హామీ ఇచ్చింది.