Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఎంతవరకు వచ్చింది? ప్రచారానికి కేవలం రెండువారాలు మిగిలివుందా? పార్టీలు ఎలాంటి స్ట్రాటజీని అవలంభించనున్నాయి? మరి ప్రచారానికి కేసీఆర్ వస్తున్నారా? కేవలం వీకెండ్ మాత్రమే హాజరవుతారా? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ శ్రేణులను వెంటాడుతున్నాయి.
జూబ్లీహిల్స్ బైపోల్‌పై కేసీఆర్ చర్చ
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగుంట ఫ్యామిలీ మూడుసార్లు గెలవడంతో ఈసారి జెండా ఎగురవేయాలని ఉత్సాహంతో బీఆర్ఎస్ ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. నామినేషన్లను గడువు ముగియడంతో ఇకపై ఆ పార్టీ నేతలు ప్రచారంపై దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కేటీఆర్-హరీష్‌రావులు భేటీ అయ్యారు.
ఇప్పుటివరకు నియోజకవర్గంలో జరిగిన.. జరుగుతున్న ప్రచారాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఇద్దరు నేతలు. రానున్నరోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనేదానిపై చర్చలు జరిపారు. రోడ్ షోలు, ప్రచార వ్యూహంపైనా ముగ్గురు నేతలు చర్చలు చేశారు. సిటీలో గెలిస్తే పార్టీకి మాంచి ఊపు వస్తుందని ఈ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని అధినేత అన్నట్లు పార్టీ వర్గాల మాట.
ప్రత్యర్థుల బలాలపై ఆరా తీసిన గులాబీ బాస్
ప్రస్తుత రాజకీయాల గురించి కూడా నేతలు మాట్లాడారట. అధికార కాంగ్రెస్, బీజేపీలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు. ఈ ఎన్నిక కోసం జాతీయ పార్టీల నేతల హాజరవుతున్నారని కేసీఆర్ దృష్టికి తెచ్చారట నేతలు. వీలైతే వీకెండ్ హాజరవుతానని కేసీఆర్ చూచాయగా అన్నట్లు సమాచారం. ఆయా పార్టీల్లో జరిగిన పరిణామాలను వివరించారట.
ALSO READ: నా చావుకు కేటీఆర్.. ఆ నేతలే కారణం?
ఇదే క్రమంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం చర్చించనున్నట్లు పార్టీ వర్గాల బోగట్టా. గురువారం జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ లతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రచార వ్యూహాలపై వారికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి కేసీఆర్ ఇచ్చిన సూచనలతో ప్రచారంలో ఆ పార్టీ నేతలు ప్రత్యర్థులపై ఎలాంటి అస్త్రాలను సంధిస్తూ, ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.