Bigg Boss 9 Promo:బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ప్రస్తుతం సీజన్ 9 కి చేరింది. ఇప్పటికే ఆరు వారాలు ముగిసాయి కూడా.. ప్రస్తుతం ఏడో వారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ నుండి ఒక ప్రోమో వైరల్ అవుతోంది. ఆ ప్రోమో చూస్తే కంటెస్టెంట్లు కంటెండర్ షిప్ కోసం ఎంతలా తపన పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ తమ దొంగ బుద్ధిని బయట పెడుతూ ఎవరి దగ్గర కూడా బయటపడకుండా దొరికిందంతా దోచుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ షోలో కంటెండర్ షిప్ కోసం ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో సంజనా, మాధురి ఇద్దరిని టీం లీడర్లుగా పెట్టి వాంటెడ్ పేట అనే పేరుతో ఓ టాస్క్ ఇచ్చి అందులో ఉన్న కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా చేసి వారికి క్యారెక్టర్ పేర్లు కూడా ఇచ్చారు.
అయితే తాజాగా ఈ గేమ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ప్రోమోలో ఏముందంటే.. రీతూ సుమన్ అన్న డబ్బులు తీయడం నేను చూసా..మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను తీయలేదని చెబుతున్నాడు..అది నాకు చాలా చిరాగ్గా ఉంది అంటూ చెబుతుంది. ఆ తర్వాత తనూజ, సుమన్ శెట్టి దగ్గర 3 నోట్స్ ఉన్నాయా అని అడిగి చూసి మళ్లీ నీ దగ్గరే పెట్టుకోమని ఇస్తుంది.ఆ తర్వాత రీతు,దివ్య ఇద్దరు గొడవ పెట్టుకుంటారు.టీం మొత్తం కంటెండర్స్ అవ్వరు కదా అని దివ్య అంటే.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్లే కంటెండర్స్ అవుతారా.. నేనేమైనా పోయి వాళ్లకి ఇస్తున్నానా అని రీతూ గొడవ పెట్టుకుంటుంది.ఆ తర్వాత తనూజ ఈ గేమే దొంగతనం చేసే గేమ్.. నువ్వు తీసుకువెళ్లి వాళ్లకి ఇస్తే ఏం ఉపయోగం అని దివ్య తో మాట్లాడుతుంది. ఆ తర్వాత రీతూ, తనూజ ఇద్దరు గొడవ పడతారు.. టీమ్ ఎందుకు ఇక తీసేసెయ్యనా అని రీతూ అంటే..మళ్ళీ మళ్ళీ అరవకు రీతూ అని తనూజ గట్టిగా అరుస్తుంది. వారి మధ్యలోకి మాధురి వచ్చి గొడవ సర్ధుమనిగేలా చేసినప్పటికీ తనూజ వినకుండా వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దివ్వెల మాధురి వెళ్లి నువ్వు నిజంగానే డబ్బులు తీయలేదా అని అడిగితే.. నేను నిజంగానే తీయలేదు అని తనూజ చెబుతుంది. నిజంగానేనా..ప్రామిస్ వేయు అని మాధురి అడిగితే గేమ్ కోసం ప్రామిస్ ఎందుకు వేస్తాను అంటూ తనూజ కౌంటర్ ఇస్తుంది. ఆ తర్వాత తనూజ తీసిన డబ్బులను లెక్కపెట్టి దాచిపెడుతుంది. అలా తనూజ డబ్బులు తీయలేదని చెప్పి మళ్ళీ డబ్బులు దాచి పెడుతుంది. అలాగే సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి రాము రాథోడ్ 200 ఇవ్వమని అడిగితే నేను ఇవ్వనురా బయటికి వెళ్ళాక 2000 ఇస్తానని చెబుతాడు. ఇక దివ్య తను దొంగలించిన డబ్బులను పైన సీక్రెట్ గా దాచిపెడుతుంది. ఇక సంజన వచ్చి దివ్యని మీ దగ్గరే ఉందా అని అడగగా..ఏంటి అనేది దివ్య ప్రశ్నిస్తుంది.ఆ తర్వాత సంజనా కాస్త కోపంగా రేపు మిమ్మల్ని తీసేసి గేమ్ ఆడుతాం అంటుంది. దాంతో దివ్యకి కోపం వచ్చి మీరు ఏం చేసినా కరెక్టే..అది ఫన్, కంటెంట్ కోసం.. కానీ పక్కోడు చేస్తే అది అన్ ఫెయిర్.. గేమ్ లో నుండి లేపేస్తారు.. మీకో రూల్ వేరే వాళ్లకో రూల్ అంటూ మండిపడుతుంది. అలా ఇక్కడితో ప్రోమో ఎండ్ అయింది .
also read:Brahmanandam : బ్రహ్మానందంకు ఘోర అవమానం.. SKNపై మండిపడుతున్న ఫ్యాన్స్
అలా ఈరోజు హౌస్ లో పెద్ద రచ్చ జరగబోతున్నట్టు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇక గేమ్ ఏంటంటే..మాధురి, సంజనా రెండు టీంలలో ఏ టీం దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే వాళ్లలో ఒకరిని కంటెండర్ షిప్ కోసం తీసుకుంటారు. ఇక ఇందులో రెండు టీంలలో ఉన్న మెంబర్స్ తమకు ఇష్టం వచ్చిన మరో టీంలోకి వెళ్లే రూల్ కూడా ఉంది.అలాగే గేమ్ అయిపోయే వరకు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్లే కంటెండర్ షిప్ కి అర్హులు.అలాగే ఎవరి టీం అయితే చివర విన్ అవుతుందో ఆ టీంలోని మెంబర్స్ లో ఎవరు కెప్టెన్ కంటెండర్ అనేది ఆ టీం మెంబర్లలో ఒకరైనటువంటి సంజనా లేదా మాధురి నిర్ణయిస్తారు.