BigTV English

Bigg Boss: TVR రేటింగ్ లో బిగ్ బాస్ కి ఏ భాషలో ఏ స్థానం అంటే?

Bigg Boss: TVR రేటింగ్ లో బిగ్ బాస్ కి ఏ భాషలో ఏ స్థానం అంటే?
Advertisement

Bigg Boss:బిగ్ బాస్ రియాల్టీ షో భారతదేశంలో అత్యధికంగా ప్రేక్షకులు చూసే టెలివిజన్ షోలలో ఒకటిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇలాంటి బిగ్గెస్ట్ రియాల్టీ షో మరొకటి లేదు. అయితే బాలీవుడ్లో మొదలైన ఈ బిగ్ బాస్ రియాల్టీ షో పలు భాషల్లో కూడా వస్తుంది. అలా హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషల్లో కూడా బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ట్ అయింది. ఇప్పటికే పలు సీజన్లు కూడా అయిపోయాయి. అయితే ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలలో ప్రస్తుతం అన్నింటికంటే ఏ భాషలో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోను ఎక్కువమంది చూస్తున్నారు. వాటి టీవీఆర్ రిపోర్ట్లు ఎలా ఉన్నాయి? టీవీఆర్ రిపోర్టులో ఏ భాషలోని బిగ్ బాస్ హైయ్యెస్ట్ ప్లేస్ లో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం..


టీవీఆర్ రేటింగ్ లో దూసుకుపోతున్న బిగ్ బాస్..

బిగ్ బాస్ రియాల్టీ షో అనేది పలు భాషల్లో వస్తుంది. అయితే ఈ బిగ్ బాస్ రియాల్టీ షోలకు సూపర్ స్టార్ లు హోస్టులుగా చేస్తున్నారు. అయితే తాజాగా పలు ఛానల్స్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో టీవీఆర్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి.. బాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 19 నడుస్తోంది . సీజన్ 19 కి 1.1 నుండి 1.3 రేటింగ్ మాత్రమే నమోదు అయింది. ఈ బిగ్ బాస్ రియాల్టీ షో కి హోస్టుగా బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సల్మాన్ ఖాన్ చేస్తున్నారు. ఒకప్పుడు భారీ టీవీఆర్ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ షో.. టీవీఆర్ రేటింగ్ ప్రస్తుతం చాలావరకు పడిపోయింది అని చెప్పుకోవచ్చు. వీకెండ్ వరకు రేటింగ్ 1.8 అలా నమోదు అవుతుంది.

మొదటి స్థానం ఎవరికంటే?

ఇక తమిళంలో వచ్చే బిగ్ బాస్ సీజన్ 9 టీవీఆర్ రిపోర్ట్ చూసుకుంటే..3.4 కోట్ల మంది ఈ షోని వీక్షిస్తున్నారు.. అలాగే 5.61 టీవీఆర్ రిపోర్ట్ ఉంది. తమిళ బిగ్ బాస్ షోకి విజయ్ సేతుపతి హోస్ట్ గా చేస్తున్నారు. కన్నడలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 17 ఈ వీకెండ్ లో మంచి టీవీఆర్ రేటింగ్ తో దూసుకుపోతోంది. 7.4 నుండి వీకెండ్ లో 10.9 వరకు టీవీఆర్ రిపోర్టు నమోదు చేసింది. కన్నడ బిగ్ బాస్ కి కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్నారు.. తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో విషయానికి వస్తే..ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 కి 11.1 టీవీఆర్ రేటింగ్ తో దూసుకుపోతోంది. అయితే మొదట్లో ఈ షో వచ్చినప్పుడు చాలామంది షోని వీక్షించారు. హైయ్యెస్ట్ టీవీఆర్ రిపోర్టు నమోదు చేసుకుంది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా ఈ షోని చూసేవారు తగ్గిపోయారు. మొదట్లో ఈ షో వచ్చిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేయగా..ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్టుగా చేశారు. ఆ తర్వాత నుండి నాగార్జుననే బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తూ వస్తున్నారు.


also read:Bigg Boss 9 Promo: అందరూ దొంగలే.. దోచుకోవడవమే లక్ష్యం!

ఆయన కారణమా?

మలయాళ బిగ్ బాస్ రియాల్టీ షో గురించి చూసుకుంటే.. అన్నిటికంటే హైయ్యెస్ట్ టీవీఆర్ రిపోర్టు మలయాళంలోనే ఉంది. మలయాళం లో వచ్చే బిగ్ బాస్ షోని చాలామంది వీక్షిస్తున్నారు. అలా ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తోంది. ఇక మలయాళ బిగ్ బాస్ కి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ గా చేస్తున్నారు. మలయాళ బిగ్ బాస్ సీజన్ 7 టీవీఆర్ రిపోర్ట్ చూసుకుంటే 12.1 రేటింగ్ తో అన్ని భాషల కంటే అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతోంది. అలా ఐదు భాషల్లో వచ్చే బిగ్ బాస్ రియాల్టీ షోలలో అన్నింటికంటే మలయాళ బిగ్ బాస్ హైయ్యెస్ట్ టీవీఆర్ రిపోర్ట్ నమోదు చేసింది.

టీవీఆర్ అంటే?

టీవీఆర్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. టీవీఆర్ అంటే టెలివిజన్ రేటింగ్ లేదా టెలివిజన్ వ్యూయర్ షిప్ రేటింగ్.. ఒక షోని ఎంతమంది వీక్షిస్తున్నారు అనేదాన్ని చూపించేదాన్ని టీవీఆర్ రిపోర్టు అంటారు. ఉదాహరణకు 5 టీవీఆర్ రిపోర్ట్ అంటే మొత్తం టీవీ చూసే ప్రేక్షకుల్లో ఐదు శాతం మంది ప్రేక్షకులు ఆ షోని చూస్తున్నారు అని అర్థం.. టీవీఆర్ అనేది ఒక షోని ఎంతమంది చూస్తున్నారు అనే విషయాన్ని అంచనా వేయడానికి టెలివిజన్ పరిశ్రమలు ఉపయోగించే ఒక ముఖ్యమైన సూచిక లాంటిది.

Related News

Bigg Boss 9 Promo: అందరూ దొంగలే.. దోచుకోవడవమే లక్ష్యం!

Bigg Boss 9: హౌజ్ లో కరుడు గట్టిన నేరస్థులు.. ఆనందంలో చిందులేసిన మాస్ మాధురి

Bigg Boss 9 Highlghts: ఆయేషా సేఫ్ వెనక పెద్ద కుట్ర.. గౌరవ్ తో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇమ్మూ ఇంత కథ నడిపించాడా

Emmanuel : దువ్వాడ మాధురి కే వెన్నుపోటు పొడిచే ప్లాన్, ఇమ్మానియేల్ మామూలోడు కాదు

Bigg Boss Ayesha: శివంగిలా రెచ్చిపోయిన ఆయేషా సైలెంట్ , అసలు కారణమేంటంటే?

Ramya Moksha: బయట ఉన్న ఫిగర్ ఏంటి.. హౌస్ లో ఉన్న ఫేస్ ఏంటి.. ?

Divvela Madhuri: సింగిల్ నామినేషన్ లేదు… మాధురి నోరు అంటే అంత భయమా ?

Big Stories

×