BigTV English

OTT Movie : డ్రగ్స్ కి బానిసై ప్రియురాలితో అలాంటి పనులు… ప్రెగ్నెన్సీ వచ్చాక దిమ్మతిరిగే ట్విస్ట్

OTT Movie : డ్రగ్స్ కి బానిసై ప్రియురాలితో అలాంటి పనులు… ప్రెగ్నెన్సీ వచ్చాక దిమ్మతిరిగే ట్విస్ట్

OTT Movie : ప్రేమించడం తప్పు కాదు కానీ, ఎవరిని ప్రేమించాలో కాస్త ఆలోచించాలి. కొంతమంది ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మీద పుడుతుందో చెప్పలేము అంటారు. అయితే ఈ సినిమా చూస్తే చచ్చినా అలా అనరు. ప్రేమించిన అబ్బాయి వల్ల హీరోయిన్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుందో మూవీలో తెలుసుకుందాం. ఈ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ లవ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘టాన్‘ (Taan). డ్రగ్స్ కి బానిసైన వ్యక్తిని పెళ్లి చేసుకొని, ఒక అమ్మాయి ఇబ్బందులు పడే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ కి తల్లిదండ్రులు లేకపోవడంతో, అక్క బావ దగ్గర ఉండి జాబ్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె ఉండటం అక్క భర్తకి నచ్చేది కాదు. ఇంటికి ఇచ్చే 5000 ఎక్కడ సరిపోతాయంటూ, ఏదైనా హాస్టల్ ని చూసుకోమని చెప్పు అని వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆ మాటలు విని రషీద్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే రషీద్ ని హీరోయిన్ ప్రేమిస్తూ ఉంటుంది. తనతో పాటు ఉండమని రషీద్ చెప్తాడు. పెళ్లి చేసుకుంటే అలా ఉండొచ్చని చెప్పడంతో, వెంటనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అలా వీళ్ళిద్దరూ కాపురం మొదలు పెడతారు. రషీద్ డ్రగ్స్ కి బాగా అలవాటు పడి ఉంటాడు. ఇంటి అద్ది కూడా కట్టలేని పరిస్థితి రావడంతో హీరోయిన్ మళ్లీ జాబ్ లోకి వెళ్తుంది. రషీద్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. ఒకసారి హీరోయిన్ అక్క రషీద్ ఇంటికి వస్తుంది. ఆమె బ్యాగ్ లో ఉన్న డబ్బులను దొంగతనం చేసి వాటితో డ్రగ్స్ తీసుకుంటాడు. ఈ విషయం హీరోయిన్ కి చెప్తుంది ఆమె అక్క. మొదట నమ్మకపోయినా రెంట్ కట్టడానికి తన దగ్గర ఉన్న డబ్బులతో, డ్రగ్స్ ని తీసుకోవడంతో అతనిపై కేకలు వేస్తుంది. అప్పుడే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని ఏడుస్తుంది హీరోయిన్. అప్పటినుంచి రషీద్ డెలివరీ బాయ్ గా వెళ్తాడు.

ఈ క్రమంలో హీరోయిన్ పై ఎవరో గుర్తుతెలియని వ్యక్తి అటాక్ చేస్తాడు. ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు రషీద్. ఇదివరకే తనకి బ్లడ్ ఇచ్చిన ఒక డోనర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే ఆ ఇంట్లో కూర్చికే పరిమితమైన ఆమె భార్యను చూసి, ఇలా ఎందుకు జరిగిందని అడుగుతాడు. అప్పుడు ఆ డోనర్ ఇలా ఎందుకు జరిగిందో నీకు తెలియదా అంటూ సమాధానం చెప్తాడు. రషీద్ వల్లే ఆమె అలా అయి ఉంటుంది. రషీద్, అతని భార్యని డ్రగ్స్ కోసం ఒకసారి గాయపరుస్తాడు. అందుకే డోనర్ భార్య కూర్చికే పరిమితమై ఉంటుంది. దీనికి ప్రతీకారంగా హీరోయిన్ పై దాడి చేస్తాడు ఆ వ్యక్తి . ఇది తెలుసుకున్న రషీద్ అతనిపై దాడికి దిగుతాడు. చివరికి హాస్పిటల్లో హీరోయిన్ ఏమవుతుంది? బ్లడ్ ఇచ్చిన డోనరే, ఎందుకు ఆమె ప్రెగ్నెన్సీ పోయే విధంగా గాయపరుస్తాడు? చివరికి రషీద్ డోనర్ ని ఏం చేస్తాడు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘టాన్’ (Taan) మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×