regenacassandrra (Source: Instagram)
Rezina Cassandra Latest Photos: హీరోయిన్ రెజినా కాసాండ్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శివ మనసులో శ్వేత చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
regenacassandrra (Source: Instagram)
ఆ తర్వాత సందీప్ కిషన్ సరసన రోటిన్ లవ్‌స్టోరీలో చిత్రంలో జతకట్టింది. ఈ రెండు సినిమాలతో రెజినా తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఇందులో ఆమె అందం, అభినయంకు ఆడియన్స్ ఫిదా అయ్యారు.
regenacassandrra (Source: Instagram)
ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాల్లో నటించి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత పవర్ చిత్రంలో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
regenacassandrra (Source: Instagram)
అదే టైంలో తమిళ్, హిందీలో ఎన్నో చిత్రాల్లో నటించింది. కేడీ బిల్లా కిల్లాడి రంగా, మానగరం వంటి చిత్రాలతో కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందింది. అలా ఓ దశాబ్ద కాలపు పాటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది.
regenacassandrra (Source: Instagram)
అన్ని బాషల్లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ రెండు చేతులా సంపాదించింది. అయితే సడెన్ ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. ముఖ్యంగా తెలుగు వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది.
regenacassandrra (Source: Instagram)
ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలతో కెరీర్ నెట్టుకొస్తున్న రెజీనా.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ ఫ్యాన్స్, నెటిజన్స్‌ని అలరిస్తుంది.
regenacassandrra (Source: Instagram)
సంప్రదాయం, స్టైలిష్, ట్రెండ్ వేర్లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా గ్రీన్ ఫ్రాక్‌లో మెస్మరైజ్ చేసింది. గ్రీన్ కలర్ ఫ్రాక్‌లో ఈ భామ క్యూట్ లుక్స్‌తో ఫిదా చేసింది.
regenacassandrra (Source: Instagram)
ఈ ఫోటోలు చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. పొట్టి గౌనులో అందాల షో చేస్తూ నెట్టింట హీట్ పెంచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.