Tollywood hero: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడూ ఎలా నడుస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన తర్వాత హీరోలు మారిపోతుంటారు. కొంతమంది దర్శకులనే పక్కన పెట్టేస్తారు. ఇలాంటి ఉదాహరణలు ఫిలిం ఇండస్ట్రీలో కోకొల్లలు ఉన్నాయి.
అలానే హిట్టు ప్లాప్ తో ఇక్కడ కెరియర్ ఆధారపడి ఉంటుంది. కొంతమందికి సూపర్ హిట్ సినిమా పడిన తర్వాత వరుస ప్లాపులు వచ్చినా కూడా పెద్దగా రిస్క్ ఉండదు. ఇంకొంతమందికి మంచి పరిచయాలు సరైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వలన కొన్ని ప్లాప్స్ వచ్చినా నిలబడగలుగుతారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరో అతను. తన కెరీర్ లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. అయితే ఆ సినిమాల్లో ఎక్కువ శాతం ప్రేక్షకులను నిరాశపరచినవి ఉండటం బాధాకరం.
అతని కష్టంలో ఎటువంటి లోపం లేదు, ప్రతి సినిమాకి ఎంత కష్టపడి పని చేస్తాడో ప్లాప్ అయిన సినిమాలకి కూడా అదే స్థాయిలో కష్టపడ్డాడు. కొన్ని ప్లాప్ అయిన సినిమాలకు విపరీతంగా కష్టపడిన రోజులు కూడా ఉన్నాయి. అతని కష్టానికి తగ్గ ఫలితం మాత్రం లభించడం లేదు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ లో అతను చేసిన చివరి సినిమా కూడా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
ఆ సినిమా సక్సెస్ అందుకు ఒక పోవడంతో అప్పటికే కమిట్ అయిన సినిమా కూడా రిస్క్ లో పడిపోయింది. ఈ హీరో ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పుడు దానిలో ఒక సినిమా కూడా రిస్క్ లో ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఒక ప్రముఖ దర్శకుడు తో ఈ యంగ్ హీరో చేయాల్సిన ప్రాజెక్ట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టును కూడా వాయిదా వేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారక ప్రకటన కూడా త్వరలో రావాల్సి ఉంది.
ఏదేమైనా ఈ హీరోకు మాత్రం కొంత మేరకు ఫ్యాన్ బేస్ ఉంది. ఒక ప్రముఖ హీరో అభిమానులు కూడా ఇతని సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తారు. అయితే ఈ హీరో క ఫ్లాప్ సినిమాలు ఎలా ఉన్నాయో, బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అగ్ర దర్శకులతో పనిచేసిన అదృష్టం ఈ హీరోకు దక్కింది. నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఒకప్పుడు ఈ హీరోతో సినిమా చేసిన వాళ్లే. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో