
imouniroy (Source: Instagram)
Mouni Roy Latest Photos: నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్లో నార్త్, సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది. సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

imouniroy (Source: Instagram)
సీరియల్ నటి అయినా ఆమె వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. కేజీయఫ్‌లో స్పెషల్ సాంగ్‌లో నటించిన ఆమె బ్రహ్మస్త్రలో కీలక పాత్ర పోషించింది.

imouniroy (Source: Instagram)
బ్రహ్మస్త్ర మూవీలో నెగిటివ్ షేడ్‌లో కనిపించి.. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. దీంతో ఈ భామ వరుస ఆఫర్స్‌తో బాలీవుడ్లో బిజీగా మారింది. అదే టైంలో దుబాయ్ వ్యాపారవేత్తను ప్రేమ పెళ్లిచేసుకుని ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.

imouniroy (Source: Instagram)
పెళ్లి తర్వాత కూడా ఈ భామ సినిమాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఆడపదడప చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తోంది.

imouniroy (Source: Instagram)
ఈ నేపథ్యంలో మౌనీ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. చేతులకు పారాణి, పూలజడతో పెళ్లి కూతురికి ముస్తాబైంది. ఈ ఫోటోలు చూసి అంత షాక్ అవుతున్నారు. ఏంటీ మౌనీ ఇలా షాకిచ్చావు.. మళ్లీ పెళ్లా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

imouniroy (Source: Instagram)
ఈ మధ్య మౌనీ సింగిల్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు భర్తతో మనస్పర్థలు వచ్చాయంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తరచూ ఆమె పర్సనల్ లైఫ్ గురించి రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయి.

imouniroy (Source: Instagram)
ఈ నేపథ్యంలో ఇలా చేతులకు పారాణి, మల్లెపూల జడతో ఫోటోలు షేర్ చేయడం నెట్టింట హాట్ టాపిక్ మారింది. అయితే ఇది క్యాజువల్ తీసుకున్న ఫోటోని తన పోస్ట్‌లో స్పష్టం చేసింది.

imouniroy (Source: Instagram)
దిగులుగా కనిపిస్తున్నాను కానీ నిజానికి నిద్రలేచినప్పుడు చాలా సరదాగా అనిపించింది, నా @anusoru x డిజైన్ చేసిన ఈ అద్భుతమైన లెహంగాలో ఇలా ముస్తాబవ్వడం స్పెషల్ ఫీలింగ్ ఇచ్చిందంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.