యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)కు వెళ్లిన వారు అక్కడ తరచుగా పురుషులు తమ ముక్కులను సున్నితంగా తాకడం ద్వారా విష్ చేసుకోవడాన్ని చూడవచ్చు. ఇలా ఒకరి ముక్కును మరొకరి ముక్కును టచ్ చేయడాన్ని అక్కడ ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. ఈ విధానాన్ని ఖాస్మ్ మఖ్ లేదంటే ముక్కు ముద్దు అని పిలుస్తారు. ఎమిరాటీ పురుషులు హలో లేదంటే వీడ్కోలు చెప్పడానికి ఈ పద్దతిని ఫాలో అవుతారు.
ఇద్దరు పురుషులు UAEలో కలిసినప్పుడు ముందగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఆ తర్వాత ఒకరి బుగ్గలను ఒకరు ముద్దు పెట్టుకుంటారు. ఆపై వారి ముక్కులను సున్నితంగా టచ్ చేసుకుంటారు. ఇది గౌరవం, స్నేహం, సాన్నిహిత్యానికి సంకేతంగా భావిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు పరిచయస్తులతో ఇలా చేసుకుంటారు. సాంస్కృతిక నియమాల కారణంగా మహిళలు సాధారణంగా పురుషులతో ఇలా చేయరు. కానీ, వారు ఇతర మహిళలల చెంపలపై సున్నితంగా ముద్దులు పెట్టుకోవడంతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు.
ఎమిరాటీ, గల్ఫ్ అరబ్ సంస్కృతిలో ముక్కును తాకడం అనేది చాలా ముఖ్యమైన పరిచయ సంకేతంగా భావిస్తారు.
⦿ గౌరవానికి సంకేతం: UAE సంస్కృతిలో, ముక్కును గర్వం, గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. ఇద్దరు వ్యక్తులు ముక్కులను తాకినప్పుడు, వారు ఒకరినొకరు సమానంగా చూడటంతో పాటు గౌరవిస్తారని చూపిస్తుంది.
⦿ స్నేహానికి గుర్తింపు: ముక్కును తాకడం అనేది నువ్వు నా స్నేహితుడివి, నేను నిన్ను పట్టించుకుంటాను అనే భావనను ఇస్తుంది. ప్రేమ, కృతజ్ఞతను చూపించడానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పెద్దలతో ఇలా చేస్తారు.
⦿ సంప్రదాయంలో భాగం: ఇలాంటి పద్దతి చాలా కాలం క్రితం ఎడారిలో నివసించిన బెడౌయిన్ తెగల నుంచి వచ్చింది. ఈ పద్దతి UAEలోని ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ప్రత్యేక మార్గంగా మారింది. ఇది కౌగిలింత, కరచాలనం కంటే మరింత ఎఫెక్టివ్ విధానంగా భావిస్తారు.
ఖాస్మ్ మఖ్ ను ఫ్యామిలీ మెంబర్స్ కలిసినప్పుడు, బంధువుల వేడుకల్లో ముక్కును తాకడం కామన్. ఈ పద్దతిని గ్రామీణ ప్రాంతాలలోని ఎమిరాటీలలో చూడవచ్చు. దుబాయ్, అబుదాబి లాంటి పెద్ద నగరాల్లో ఈ పద్దతి కామన్ గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే UAE జనాభాలో దాదాపు 80 నుంచి 90% మంది ప్రజలు ఈ పద్దతిని పాటిస్తారు.
ఒక వేళ మీరు కూడా UAEకి వెళ్తే, అక్కడి వారి ముక్కు తాకాల్సిన అవసరం లేదు. సింపుల్ గా షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది. “అస్ సలాం అలైకుమ్” (మీకు శాంతి కలుగుగాక) అని చెప్తే చాలు. ఎమిరేట్స్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. సందర్శకులు వారి అన్ని ఆచారాలను తెలుసుకోవాలని ఆశించరు. కానీ, మీరు వారి సంస్కృతి పట్ల గౌరవం చూపిస్తే చాలా సంతోషపడుతారు.
Read Also: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?