Highest Daily Salary States: భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో రోజు వారీ వేతనాలపై ప్రభావం చూపుతున్నాయి. జాతీయ సగటు రోజువారీ జీతం రూ.1,077 వద్ద ఉంది. ప్రాంతీయ వ్యత్యాసాలు రాష్ట్రాల ఆదాయాలను ప్రభావితం చేస్తున్నాయి.
2025లో దేశ రాజధాని దిల్లీ అత్యధిక సగటున రోజువారీ వేతనం రూ.1,346 కలిగి అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక రూ.1,269తో, మహారాష్ట్ర రూ.1,231తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రూ.1,192 రోజు వారీ జీతంతో తెలంగాణ నాల్గో స్థానంలో ఉండగా, రూ.1,154 జీతంతో హర్యానా ఐదో స్థానంలో ఉంది. రూ.1,115 జీతంతో తమిళనాడు ఆరో స్థానంలో, రూ.1,077 జీతంతో గుజరాత్ ఏడో స్థానంలో ఉంది.
రూ.1,038 జీతంతో ఉత్తరప్రదేశ్ ఎనిమిది స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రోజు వారీ వేతనం రూ.1,000తో తొమ్మిదో స్థానంలో, రూ.962 జీతంతో పంజాబ్ పది స్థానంలో నిలిచింది.
1. ఢిల్లీ: రూ. 1,346
2. కర్ణాటక: రూ. 1,269
3. మహారాష్ట్ర: రూ. 1,231
4. తెలంగాణ: రూ. 1,192
5. హర్యానా: రూ. 1,154
6. తమిళనాడు: రూ. 1,115
7. గుజరాత్: రూ. 1,077
8. ఉత్తర ప్రదేశ్: రూ. 1,038
9. ఆంధ్రప్రదేశ్: రూ. 1,000
10. పంజాబ్: రూ. 962
ప్రభుత్వ, ఐటీ, ఫైనాన్స్, కార్పొరేట్ రంగాలలో అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కువగా దిల్లీలో ఉండడంతో.. అత్యధిక రోజువారీ వేతనం రూ.1,346తో అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ సంస్థలకు కేంద్రమైన గుర్గావ్ దిల్లీకి సమీపంలో ఉంది.
భారతదేశ టెక్నాలజీ క్యాపిటల్ బెంగళూరు ఉన్న కర్ణాటక రోజు వారీ వేతనం రూ.1,269తో రెండో స్థానంలో ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, ఇంజినీరింగ్ పరిశ్రమలు కర్ణాటకలో వేతన స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
మహారాష్ట్ర మూడో స్థానానికి.. ప్రధానంగా ముంబై ఆర్థిక, వినోదం, తయారీ రంగాలలో అత్యధిక జీతాలు కలిగి ఉండడం కారణమయ్యాయి.
Also Read: SBI UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. కస్టమర్లకు ఎస్బీఐ కీలక సూచన
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ, ఫార్మా కంపెనీలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. హర్యానాలో పారిశ్రామిక, మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు వేతనాల స్థాయిని పెంచుతున్నాయి. చెన్నైలో పారిశ్రామిక, ఆటోమోటివ్ క్లస్టర్‌లు ఉండడంతో తమిళనాడు కూడా వేతనాల్లో అగ్రస్థానంలో ఉంది. వీటికి తోడు ఐటీ రంగం అభివృద్ధి చెందుతుండడంతో ఆ రాష్ట్ర సగటు రోజువారీ జీతం పెరగడానికి దోహదపడుతుంది.