ప్రయాణీకులను సేఫ్ గా గమ్యస్థానాలకు చేర్చడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ప్రయాణ సమయంలో ప్యాసింజర్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైనా వెంటనే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ప్రయాణీకుడు తీవ్ర ఆనారోగ్యానికి గురైతే అవసరం అయితే, రైలును నిలిపివేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ప్రయాణీకుడికి గుండెపోటు రావడంతో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు రైల్వే అధికారులు. కాజీపేట రైల్వే స్టేషన్ లో సుమారు గంట నుంచి ఆపివేశారు.
ప్రయాణ సమయంలో గుండెపోటు రావడంతో రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాజీపేట రైల్వే స్టేషన్ లో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, పరిస్థితి విషమించడంతో సదరు ప్రయాణీకుడు స్టేషన్ రాకముందే ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో అధికారులు చెప్పారు. కానీ, డెడ్ బాడీ ఇవ్వాలని మృతుడి బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో కాజీపేట రైల్వే స్టేషన్ లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. సుమారు గంట నుంచి కాజీపేటలోనే రైలు నిలిచిపోయింది.
Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?
చాలా సేపటి నుంచి రైలు ఆగిపోవడంతో ఇతర ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు, మహిళలలు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీలైనంత త్వరగా ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టి, రైలు బయల్దేరేలా చూస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Read Also: ఇక ఆ 10 రైళ్లు తిరుపతి నుంచి కాదు తిరుచానూరు నుంచి నడుస్తాయట, ఎందుకంటే?