malvikasharmaofficial (source: instagram)
Malavika Sharma Latest Photos: హీరోయిన్ మాళవిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేల టిక్కెట్టు చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది ఈ భామ. ఈ సినిమా పెద్దగా ఆశించిన విజయం సాధించలేదు.
malvikasharmaofficial (source: instagram)
కానీ, ఇందులో మాళవిక లుక్, గ్లామర్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. ఆమె అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. కానీ, ఆఫర్స్ మాత్రం పెద్దగా తలుపు తట్టలేదు. దీంతో మళ్లీ ఫ్యాన్స్‌ని పలకరించేందుకు ఈ అమ్మడికి మూడేళ్లు టైం పట్టింది.
malvikasharmaofficial (source: instagram)
మూడేళ్ల తర్వాత రామ్ పోతినేని రెడ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా బోల్తా కొట్టడంతో అమ్మడికి మళ్లీ నిరాశ తప్పలేదు. ఇక తెలుగు ఆఫర్స్ రాకపోవడం తమిళ్, హిందీ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా ఈ భామకు పెద్దగా కలిసి రాలేదు.
malvikasharmaofficial (source: instagram)
దీంతో మళ్లీ మూడేళ్ల తర్వాత తెలుగులో రెండు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. సుధీర్ బాబు 'హరోం హర', ఆ తర్వాత భీమ్ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదు. దీంతో తెలుగులో ఇండస్ట్రీలో మాళవికకు చెప్పుకోదగ్గ హిట్ లేదు.
malvikasharmaofficial (source: instagram)
ఇక సినిమాల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం మాళవిక సందడి మామూలుగా ఉండదు. వీలు చిక్కినప్పుడల్లా హాట్ ఫోటో షూట్లో ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. తరచూ బోల్డ్ ఫోటోషూట్‌తో షాకిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన హాట్ షోతో కుర్రాళ్లను కనువిందు చేసింది ఈ భామ.
malvikasharmaofficial (source: instagram)
డిఫరెంట్ ఫోజుల్లో.. క్యూట్ క్యూట్ లుక్స్ ఫిదా చేసింది. ముద్దు పెడుతూ.. కళ్లు చూపిస్తూ.. ఇలా వెరైటీ ఫోజులతో సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం మాళవిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సో క్యూట్, హాట్ అంటూ మాళవిక ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.