AA22xA6 : ప్రస్తుతం తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ అట్లీ సినిమా ఒకటి. రాజా రాణి సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన అట్లీ ఇప్పటికే ఐదు సినిమాలను పూర్తి చేశాడు. ఈ ఐదు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. 100% సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది దర్శకులలో అట్లీ ఒకడు.
అట్లీ లాస్ట్ ఫిలిం జవాన్ కూడా బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఒక్కసారిగా అట్లీ రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు అట్లీ సినిమా అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మొదటి సినిమా మాత్రమే మిడ్రెంజ్ హీరోలతో చేశాడు కానీ. ఆ తర్వాత నుంచి అన్ని సినిమాలు కూడా స్టార్ హీరోస్ తోనే. విజయ్ తో ఏకంగా మూడు సినిమాలు చేసి సక్సెస్ కొట్టాడు.
అల్లు అర్జున్ సినిమా వ్యవహారాలన్నీ కూడా బన్నీ వాసు చూస్తుంటారు. ఆల్రెడీ బన్నీ వాస్ ముంబై వెళ్లి వచ్చారు. తన సినిమాలు ఇక్కడ రిలీజ్ పనుల్లో ఉండటం వలన నెల రోజులుగా హైదరాబాదులోనే ఉంటున్నారు. అందుకే ప్రెస్ మీట్స్, సక్సెస్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ లో దర్శనమిస్తున్నారు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసును అట్లీ సినిమా గురించి అప్డేట్ అడిగితే, చాలా చక్కగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఆ సినిమా గురించి నేనేమీ మాట్లాడకూడదు. నాకు కూడా ఇప్పుడు పెద్దగా తెలియదు నేను నెల రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. ముంబై వెళ్ళిన తర్వాత నాకు ఆ సినిమా గురించి క్లారిటీ వస్తుంది అని చెప్పారు బన్నీ వాసు.
చాలామంది ఆ సినిమా రిలీజ్ గురించి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రిలీజ్ డేట్ పై కూడా కొద్దిపాటి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే నేను ఏమీ మాట్లాడకూడదు అని అగ్రిమెంట్ చేయించుకున్నాను.
ఈ సినిమా 2026 ఎండింగ్ లో ఉంటుందా 2027 స్టార్టింగ్ లో ఉంటుందా అనేది సన్ నెట్వర్క్ వాళ్లు అనౌన్స్ చేస్తారు. మొత్తానికి ఈ టైం పీరియడ్ బన్నీ వాసు చెప్పడంతో అయితే డిసెంబర్ లేకపోతే జనవరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది అని చాలామందికి అవగాహన వచ్చేసింది.
ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపుగా ఈ సినిమా కోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ కూడా మారిపోయింది. అట్లీ కూడా జవాన్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాడు. అందుకే ఈ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్టు గురించి విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది.
Also Read: Mithra Mandali : తెలివితేటలు ప్రదర్శించొద్దు, మిత్రమండలి సినిమా పైన ఓపెన్ అయిన బన్నీ వాస్