PVRInox : సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. కొత్త కొత్త టెక్నాలజీ పుట్టుకొచ్చింది. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చాయి.
అలానే మరోవైపు ఆడియన్స్ కూడా థియేటర్ కు రావడం తగ్గించేశారు. దీనికి మెయిన్ రీజన్ సినిమా విడుదలైన నెల రోజుల్లో ఓటీటీ లో దర్శనం ఇవ్వడం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు వచ్చే కిక్కు ఇంట్లో చూస్తున్నప్పుడు రాదు కాబట్టి చాలామంది థియేటర్ కు వెళ్లడానికి ప్రిఫర్ చేస్తారు. అయితే నేటి కాలంలో ఒక ఫ్యామిలీతో సినిమా థియేటర్ కు వెళితే కనీసం 2000 నుంచి 3000 వరకు అయిపోతుంది.
ఈ మధ్యకాలంలో టికెట్ రేట్లు కూడా మారిపోయాయి. మినిమం 400 మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక సినిమా టికెట్ కోసం పెట్టాల్సి వస్తుంది. ఇంకా పాప్కాన్ కాస్ట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ తరుణంలో బెంగుళూరు పివిఆర్ థియేటర్స్ యాజమాన్యం కొత్తరకమైన ఎక్స్పీరియన్స్ కి శ్రీకారం చుట్టింది.
మామూలుగా ఇంట్లో భోజనం చేస్తూ టీవీ చూడటం అనేది చాలామందికి అలవాటు. అయితే ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు సౌండ్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. థియేటర్లో ఆ పని సాధ్యం కాదు. అందుకే సినిమా ధియేటర్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ వస్తే చాలా ఇబ్బందిగా మాట్లాడాల్సిన పరిస్థితి.
అయితే బెంగళూరు పివిఆర్ ఐనాక్స్ తింటూ సినిమా చూసి థియేటర్ ఓపెన్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది కొంతమేరకు మంచి థాట్. కానీ సినిమాని ప్రశాంతంగా చూడగలమా అనేది అసలైన డౌట్.
సినిమా ధియేటర్ కి వచ్చిన వాళ్ళు చాలా ఏకాగ్రతతో సినిమాను చూస్తుంటారు. ఏమైనా మిస్ అయిపోతామేమో అని ఇంటర్విల్ నుంచి హడావిడిగా వచ్చి లోపల కూర్చుంటారు. ఓటీటీ లో సినిమా చూస్తున్నప్పుడు అంత ఏకాగ్రత ఉండదు.
సినిమా థియేటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి సినిమా మొదలైన కాసేపటికి కొంతమంది బీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా టార్చ్లు కొట్టుకుంటూ వస్తారు. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకొంతమంది పాప్కాన్ తీసుకొచ్చి సౌండ్ చేస్తూ పరపర తింటూ ఉంటారు. అది పక్కన కూర్చున్న కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది.
కేవలం పాప్కాన్ విషయంలోనే ఇబ్బందిగా అనిపిస్తే సినిమా చూడాలి తిండి కోసం కాదు అని థియేటర్ కి వెళ్లిన ఆడియన్ కి కచ్చితంగా ఈ డైనింగ్ థియేటర్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఈ థియేటర్ పైన సోషల్ మీడియాలో కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Also Read: Pawan Kalyan : మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి పీపుల్ మీడియాలో