OTT Movie : హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాలు కొంచెం కొంచెం భయపెట్టిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాయి. క్లైమాక్స్ వరకు ఇవి ఇచ్చే ట్విస్టులు, సౌండ్ ఎఫ్ఫెక్ట్స్, మధ్యలో వచ్చే దెయ్యాలు, ఆడియన్స్ చేత కేకలు పెట్టిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక రిటైర్డ్ పోలిస్, ఒక అపార్ట్‌మెంట్‌లో సూపర్‌గా పని చేయడంతో మొదలవుతుంది. అక్కడ జరిగే మిస్టరీ మర్డర్స్ ను కనుక్కునే ప్రయత్నంలో ఈ కథ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది సూపర్’ (The super) అనే ఈ సినిమాకి స్టెఫాన్ రిక్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్యాట్రిక్ ఫ్లూగర్, వాల్ కిల్మర్,టేలర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 అక్టోబర్ 18న రిలీజ్ అయింది. IMDbలో ఈ సినిమాకి 5.2/10 రేటింగ్ కూడా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఫిల్ అనే వ్యక్తి పోలీస డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్డ్ అవుతాడు. అతనికి వయోలెట్, రోజ్అనే ఇద్దరు కూతుర్లు ఉంటారు. అతని భార్య చనిపోవడంతో వీళ్ళ బాధ్యత పిల్ పై పడుతుంది. దీంతో అతను ఒక అపార్ట్‌మెంట్ లో మెయింటెనెన్స్ వర్కర్ గా ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఈ ఉద్యోగం ప్రశాంతంగా చేసుకుంటున్న సమయంలో, వాల్టర్ అనే వ్యక్తి కూడా అతనితో పాటు సూపర్ వైజర్ గా చేస్తుంటాడు. అతను చాలా మిస్టీరియస్‌గా ఉంటాడు. ఫిల్ తన పని చేసుకుంటూ, కూతుళ్లకు ఆర్థికంగా సహాయపడుతుంటాడు. వయోలెట్ కి ఇప్పుడు తల్లి లేని లోటును ఫిల్ తీరుస్తుంటాడు. అయితే పెద్ద కూతురు తన తల్లిని మరిచిపోలేక బాధపడుతుంటుంది. చిన్న కూతురు రోజ్ మాత్రం ఆడుకుంటూ సమయం గడుపుతుంటుంది.
ఫిల్ తన ఉద్యోగం ప్రశాంతంగా చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. బిల్డింగ్‌లో ఉండే ప్రజలు ఒక్కొక్కరు మిస్సింగ్ అవుతుంటారు. ఎక్కడో ఏదో జరుగుతోందని ఫిల్ కి అనుమానం వస్తుంది. ఆ అనుమానం కాస్త వాల్టర్‌పై పడుతుంది. వాల్టర్‌ను ఫిల్ ఫాలో చేస్తాడు. అయితే అతనికి ఎక్కడా సరైన క్లూ దొరకదు. ఈ సమయంలో అక్కడ మళ్ళీ మర్డర్ జరుగుతుంది. చనిపోయింది వయోలెట్ కి ఫేవరెట్ టీచర్. ఫిల్‌కు మాత్రం వాల్టర్ చూస్తే కంగారుగా అనిపిస్తుంది. అయితే అదే బిల్డింగ్‌లో మరికొన్ని హత్యలు జరుగుతాయి. వాల్టర్ ఈ హత్యల గురించి డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు.
Read Also : బాయ్ ఫ్రెండ్ ను వదిలేసి అమ్మాయిపై అలాంటి కోరికలు… అన్నీ అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు భయ్యా
ఇప్పుడు ఫిల్ కి దిమ్మ తిరిగే విషయాలు తెలుస్తాయి. ఫిల్ చిన్న కూతురు రోజ్ ఒక దెయ్యం. చనిపోయి చాలా రోజులు అవుతుంటుంది.అయితే ఆ విషయం ఫిల్ కి తెలీదు.ఈ అపార్ట్మెంట్ లో కూడా హత్యాలను దెయ్యం రూపంలో రోజ్ వచ్చి చేస్తుంటుంది.ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్తాడు ఫిల్. ఇక క్లైమాక్స్ భయంకరమైన రిచ్యువల్స్ తో ముగుస్తుంది. రోజ్ ఎప్పుడు చనిపోయింది ?ఆ అపార్ట్మెంట్ లో ఎందుకు హత్యలు జరుగుతున్నాయి ? ఫిల్ దీనిని ఎలా ఎదుర్కుంటాడు ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.