Pawan Kalyan : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా మరోసారి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ వద్ద తెలిసేలా చేసింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
ఓ జి సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంక దాదాపు సినిమాలు చేయను అనే క్లారిటీ ఇచ్చేశారు. ఒకవేళ సినిమాలు చేసిన తన ప్రొడక్షన్ హౌస్ లో నిర్మిస్తాను అని చెప్పారు. అయితే రీసెంట్ గా ఓ జి సినిమా చూసిన తర్వాత ఆ యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని మరోసారి తన మనసులో మాట చెప్పారు. తాజాగా ఇంతకుముందు అనుకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారట పవన్ కళ్యాణ్.
వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజు నిర్మించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే అప్పటికి ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ రేట్లు తక్కువగా ఉండటం వలన ఈ సినిమాకి ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కేవలం టిక్కెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్లనే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు అంతంత మాత్రమే వసూలు చేసేయ్. వీటివలన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టాలు వచ్చాయి.
అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒకేసారి ఐదు ఆరు ప్రాజెక్టులను అనౌన్స్ చేశారు. వాటిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు పూర్తయిపోయాయి. రామ్ తల్లూరి నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాని పవన్ కళ్యాణ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట.
ఆ సినిమాతో పాటు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ చేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఓ జి సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది.
దాదాపు 50 సినిమాలు పూర్తి చేస్తున్న ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాలో ఇదివరకు బ్రో అనే సినిమా చేశారు. ఈ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారట. అయితే దర్శకుడు ఎవరు అనేది ఇంకా తేలలేదు. మొత్తానికి వీటి గురించి అధికారక ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Also Read: AA22xA6 : అట్లీ అల్లు అర్జున్ సినిమాపై నోరు విప్పలేదు, తెలివిగా ప్రశ్నను దాటేశారు