BigTV English
Advertisement

Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్‌ ఫైర్‌

Deepika Padukone: ఛీ.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా.. దీపికాపై నెటిజన్స్‌ ఫైర్‌

Deepika Abu Dhabi tourism ad: బాలివుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె ఈ మధ్య వివాదాల్లో నిలుస్తోంది. వరుసగా ఆమెను భారీ చిత్రాల్లో నుంచి తొలగించడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కొద్ది రోజులు తరచూ వార్తల్లో నిలుస్తున్న దీపికా.. తాజాగా ఓ యాడ్‌లో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా దీపికా తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె వేషధారణ చూసి ఆడియన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంట.. దీపికా రోజురోజుకి ఇలా దిగజారిపోతున్నావు.. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా? ఎంతకైనా దిగజారుతావా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు.


తలపోగరు.. ఆఫర్ష్‌ దూరం..

అసలేమైందంటే.. దీపికా పదుకొనె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించింది. హిస్టారికల్‌ సినిమాల్లో నటించింది. పద్మావత్‌, బాజీరావ్‌ మస్తానీ, రామ్‌ లీలా వంటి ఇండియన్‌ హిస్టారికల్‌ వంటి ప్రెస్టిజియస్‌ చిత్రాల్లో భాగమైంది. అలా బాలీవుడ్‌లో ఎన్నో హిట్స్‌, బ్లాక్‌బస్టర్స్‌ హిట్స్‌ ఇచ్చింది. అంతేకాదు అత్యధిక పారితోషికంగా తీసుకున్న ఇండియన్‌ మూవీ నటీమణుల్లో
దీపికా టాప్‌లో ప్లేస్‌ ఉందనడంతో సందేహం లేదు. అలాంటి దీపికా ఈ మధ్య పారితోషికం విషయంలో తరచూ వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటుంది. చివరిగా కల్కి 2898 ఏడీ వంటి ప్రతిష్టాత్మక చిత్రంతో తెలుగులో అడుగుపెట్టిన దీపికా.. తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ విషయంలో తలపోగరు చూపిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి.

ఫరా ఖాన్‌ చురకలు 

దీనికి ఇటీవల బాలీవుడ్‌ దర్శకురాలు ఫరా ఖాన్‌ చేసిన కామెంట్స్‌ ఉదాహరణ. తన షోలో భాగంగా ప్రముఖ నటుడు ఇంటికి వెళ్లిన ఫరా.. దీపికా ప్రస్థావన రాగా.. తనదైన స్టైల్లో సెటైర్లు వేసింది. ఆమె పని చేసేది 8 గంటలు..ఇక నా షోకి వచ్చే సమయం తనకి లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ దీపికాకు చురకలు వేసింది. అలా అందరి చేత ఇండస్ట్రీ వర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న దీపికా తాజాగా సోషల్‌ మీడియాలో నెగిటివిటీని ఎదుర్కొంటోంది. రీసెంట్‌గా రణ్‌వీర్‌, దీపికా పదుకొనెలు కలిసి అబుదాబి యాడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన తాజాగా విడుదలైంది. ఇందులో దీపికా హిజాజ్‌ ధరించి కనిపించింది. ఈ ప్రమోషనల్‌ యాడ్‌లో రణ్‌వీర్‌, దీపికాలు ఇద్దరు ఓ మ్యూజియంలో ఉన్నట్టు కనిపించారు. ఇక్కడ ఇద్దరు కలిసి అబుదాబి ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అంటూ ఏడాది దేశాన్ని ప్రమోట్‌ చేశారు.


Also Read: Kantara Chapter 2 : కాంతార ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్… సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే

డబ్బిస్తే చాలా.. విలువలు లేవా?

ఇదంత ఓకే.. కానీ,ఇందులో దీపికా హిజాజ్‌ ధరించడమే ఇండియన్‌ ఆడియన్స్‌కి రూచించడం లేదు. హిందూ అమ్మాయి అయ్యి ఉండి.. ఆమె హిజాన్‌ ధరించడంపై హిందు సంఘాలు, నెటిజన్స్‌న నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భారతీయ నటివి, పైగా హిందూ మహిళా అయ్యిండు ఇలా హిజాజ్‌ ధరించడానికి సి** అనిపించలేదా? డబ్బుల కోసం ఎంతకైనా దిగజారతావా?.. నీకు రెమ్యునరేషనే ముఖ్యమా.. కనీస విలువలు పాటించవా? అంటూ చివాట్లు పెడుతున్నారు. పరదేశాన్ని ప్రమోటు చేస్తూ యాడ్‌ చేయడం తప్పులేదు.. కానీ.. హిందూ ధర్మాన్ని, విలువలను కూడా విస్మరించే వ్యవహరించడం హేయం కాదంటూ దీపికాపై మండిపడుతున్నారు. ఇప్పటికే కల్కి 2, స్పిరిట్‌ వంటి చిత్రాల నుంచి ఆమెను తొలగించడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారిన దీపికా.. ఇప్పుడు తాజా యాడ్‌ మరోసారి వివాదంలో నిలవడం ఆమె ఫ్యాన్స్‌ని బాధిస్తోంది. ఏంటి.. ఇంత అనుభవం ఉన్న నటివి.. ఏదైనా చేసేటప్పుడు ముందు వెనక చూసుకోవాలి కదా అంటూ ఆమె ఫ్యాన్స్‌ దీపికాకు సూచిస్తున్నారు.

Related News

Samantha: న్యూ చాప్టర్ బిగిన్స్… ఫైనల్‌గా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సమంత!

2026 Mega Movie’s: వచ్చే ఏడాది మెగా మేనియా షురూ.. ఎవరి సామర్థ్యం ఎంత?

Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ లోడింగ్.. విడుదలకు ముహూర్తం పిక్స్?

Rashmika Mandanna: మనసులో కోరిక బయట పెట్టిన రష్మిక.. సాధిస్తుందా?

Jackie Chan: జాకీ చాన్ మరణం పై వార్తలు.. బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా!

Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?

Prabhas @23 Years : అది బాడీ కాదురా… బాక్సాఫీస్.. 23 ఏళ్లల్లో ఎన్ని వేల కోట్లు అంటే ?

Rashmika -Vijay: ఎంగేజ్మెంట్ తర్వాత ఒకే స్టేజ్‌పైకి విజయ్ – రష్మిక… గుడ్ న్యూస్ లోడింగా ?

Big Stories

×