Bunny Vasu : కొన్ని ప్రాజెక్టులు ప్రేక్షకులకు సినిమా మీద విపరీతమైన అంచనాలు క్రియేట్ చేస్తాయి. అలాంటి ప్రాజెక్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఒకటి. మొదటిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ జులాయి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇదే సినిమాతో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చింది.
ఈ బ్యానర్ లో త్రివిక్రమ్ జులాయి చేసిన తర్వాత, వేరే బ్యానర్ లో అత్తారింటికి దారేది అనే సినిమాను చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు హారిక హాసిని క్రియేషన్స్ లో తప్ప త్రివిక్రమ్ ఇంకొక బ్యానర్ లో సినిమా కూడా చేయలేదు. ఇక మరోసారి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో కూడా ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడానికి పలు రకాల కారణాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ కి బన్నీ వాస్ ఎంత క్లోజ్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్య సినిమా నుంచి వీరిద్దరికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఏ సినిమాలో కూడా బన్నీ వాసు కనిపిస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకి సంబంధించిన కీలక విషయాలన్నిటినీ కూడా బన్నీ వాసు చూసుకుంటారు. మరోవైపు బన్నీ వాస్ నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు.
బన్నీ వాస్ నిర్మించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు వాసు. ఎప్పటిలాగానే త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి ప్రశ్నలు బన్నీ వాసు ఎదుర్కొన్నారు. మామూలుగా ఏదో నీట్ గా సమాధానం చెప్పి గతంలో వాసు దాటుకున్నారు.
ఈసారి మాత్రం ఓపెన్ గా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళతో దయచేసి ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడకండి. గతంలో మీరు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడటం వలన నేను పర్సనల్ గా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కేవలం మిత్రమండలి సినిమా గురించి మాత్రమే మాట్లాడండి అంటూ చెప్పారు.
అయితే సదరు జర్నలిస్ట్ బన్నీ వాసుని ఉద్దేశించి లేదు వీళ్ళ ప్రాజెక్టు మళ్ళీ ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. వీరిద్దరికీ కూడా ఒక మీటింగ్ జరిగినట్లు తెలిసింది అని అడిగారు. నేను దాని గురించి ఏమీ మాట్లాడను. ప్రాజెక్టు జరగడం అనేది పెద్ద విషయం కాదు వారిద్దరూ కూర్చొని గంట మాట్లాడుకుంటే అన్ని సెట్ అయిపోతాయి.
ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా మీద విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పుష్ప సినిమాతో విపరీతమైన గుర్తింపు అల్లు అర్జున్ సాధించుకున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ వెంకటేష్ హీరోగా సినిమాను చేస్తున్నారు.
Also Read: Venkatesh X Trivikram : సెట్స్‌లో త్రివిక్రమ్, వెంకటేష్, మొత్తానికి అజ్ఞాతవాసం వీడిని గురూజీ