OTT Movie : ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలనే ఆదరించిన మన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న ప్రతి స్టోరీని ఆదరించడం మొదలుపెట్టారు. వీటిలో కొరియన్, మలయాళం సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ రావడమే ఆలస్యం, ఓ లుక్ వేసేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ, థ్రిల్లర్ అభిమానులకు ఒక హాట్ కేక్ అందించింది. ఒక పోలీస్ ఆఫీసర్ గన్ పోగొట్టుకోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ స్టోరీ చివరివరకు ట్విస్టులతో మెంటల్ ఎక్కిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘కరోనా పేపర్స్’ (Corona papers) 2023లో వచ్చిన మలయాళం యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ప్రియదర్శన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో షేన్ నిగమ్, షైన్ టామ్ చాకో, సిద్దీఖ్, జీన్ పాల్ లాల్, గాయత్రీ శంకర్, సంధ్యా షెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 6న థియేటర్లలో విడుదలైంది. IMDb లో 6.4/10 రేటింగ్ తో ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రాహుల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా తన సర్వీస్ రివాల్వర్ పోగొట్టుకుంటాడు. ఈ గన్ కాస్త దొంగల చేతుల్లో పడుతుంది. ఈ దొంగలు గన్ ఉపయోగించి దొంగతనాలు చేయడం మొదలు పెడతారు. చిన్న దొంగతనాలతో ఆగకుండా బ్యాంకు రాబరీ కి ప్లాన్ చేస్తారు. ఇదే సమయంలో రాహుల్ గన్ వేటలో పడతాడు. పోలీసు అధికారులు, గన్ కనిపెట్టలేకపోతే ఉద్యోగం పోతుందని హెచ్చరిస్తారు. ఇప్పుడు అతనికి ఉద్యోగం ఊడే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ గన్ కోసం రాహుల్ వేట మొదలు పెడతాడు. అయితే ఈ గన్ దొంగల చేతుల్లో పడిందని అతను తెలుసుకుంటాడు.
Read Also : వృద్ధాప్యంలో వింత కోరికలు… ఈ గ్రాండ్ మా గారడీ యమా కామెడీ గురూ… 20 ఏళ్ల తరువాత వచ్చిన సీక్వెల్