BigTV English

Trisha Krishan: చీరకే అందం తీసుకురావడం అంటే ఇదేనేమో.. దేవతలా ఉందే

Trisha Krishan: సూపర్ స్టార్ మహేష్ బాబును, మెగాస్టార్ చిరంజీవిని చూస్తున్నప్పుడు వీరి ఏజ్ పెరుగుతుందా .. ? తరుగుతుందా.. ? అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఆ చర్చ మొదట త్రిష  కృష్ణన్ గురించి చేయాలి.

(Image Source: Trisha Krishan /Instagram)

41 ఏళ్ల వయస్సులో కూడా ఆ అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. త్రిష ఏజ్ పెరుగుతుందా.. ? తరుగుతుందా.. ? అని నోళ్లు వెళ్లబెడుతున్నారు.

(Image Source: Trisha Krishan /Instagram)

1999 లో వచ్చిన జోడీ  సినిమాలో సిమ్రాన్ కు ఫ్రెండ్ గా త్రిష ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత అలాంటి పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది. నీ మనసు నాకు తెలుసు అనే బై లింగువల్ సినిమాతో త్రిష తెలుగుకు పరిచయమైంది.

(Image Source: Trisha Krishan /Instagram)

ఇక ప్రభాస్ సరసన వర్షం సినిమాలో సోలో హీరోయిన్ గా  నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

(Image Source: Trisha Krishan /Instagram)

తెలుగు, తమిళ్, మలయాళం  అన్ని భాషల్లో త్రిష స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో కొన్నేళ్ళు త్రిష  సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఎప్పుడైతే 96 సినిమా అన్ని భాషల్లో హిట్ అయ్యిందో అప్పటి నుంచి అమ్మడి దశ తిరిగింది.

(Image Source: Trisha Krishan /Instagram)

స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా ఒకపక్క, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇంకోపక్క.. ఇలా మంచి మంచి విజయాలను అందుకుంటూ వస్తుంది.

(Image Source: Trisha Krishan /Instagram)

ప్రస్తుతం త్రిష చేతిలో మూడు, నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభరలో నటిస్తుంది. ఇది  కాకుండా తమిళ్ లో అజిత్ సరసన విదాముయార్చిలో నటిస్తోంది.

(Image Source: Trisha Krishan /Instagram)

తాజాగా విదాముయార్చి షూటింగ్ నుంచి త్రిష కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. కాంజీవరం చీరలో త్రిష అచ్చ తెలుగు ఆడపడుచులా మెరిసిపోతుంది.

(Image Source: Trisha Krishan /Instagram)

త్రిష చీరకట్టుకున్న ఫోటోలను చూసిన అభిమానులు..చీరకే అందం తీసుకురావడం అంటే ఇదేనేమో.. దేవతలా ఉందే అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి ఈ సినిమాలతో త్రిష ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×