బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కూడిన మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ఒకరకంగా ఇది బీజేపీకి సవాల్ లాంటిదే. ఎందుకంటే బీజేపీ సహజంగానే సీఎం అభ్యర్థిని ప్రకటించదు. కూటమి లోని జేడీయూ అధినేత, ప్రస్తుత సీఎం నితీష్ కుమారే తిరిగి మా సీఎం అభ్యర్థి అనే సాహసం కూడా బీజేపీ చేయదు. సరిగ్గా ఈ టైమ్ లో కాంగ్రెస్ పార్టీ మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ప్రకటించి సాహసం చేసింది. దీంతో బీజేపీ డైలమాలో పడింది.
कांग्रेस अध्यक्ष श्री @kharge, नेता विपक्ष श्री @RahulGandhi और सभी नेताओं की सहमति के साथ हम श्री @yadavtejashwi को मुख्यमंत्री पद का उम्मीदवार घोषित कर रहे हैं।
तेजस्वी यादव जी का लंबा राजनीतिक सफर है और हमें विश्वास है कि जनता का उन्हें खूब प्यार मिलेगा।
इसके साथ ही, श्री… pic.twitter.com/q60DzNq6ul
— Congress (@INCIndia) October 23, 2025
ఎవరు మీ సీఎం..?
బీహార్ తాజా సీఎం నితీష్ కుమార్ పై పచ్చి అవకాశవాది అనే ముద్ర ఉంది. అవసరం ఉంటే బీజేపీతో కలుస్తారు, లేదంటే కాంగ్రెస్ తో దోస్తీకి సై అంటారు, ఆర్జేడీతో కూడా కలసి చివరకు వారిని ఏమార్చి అధికారం సొంతం చేసుకుని ఆ తర్వాత దూరం పెట్టిన చరిత్ర కూడా నితీష్ కి ఉంది. పైగా ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడాబాగోలేదని అంటున్నారు. పోనీ ఆయన వారసుడినైనా ప్రకటిస్తారా అంటే అదీ కుదరదు. ఎందుకంటే బీజేపీ విడిగా పోటీ చేసినా, కూటమిలో కీలకంగా ఉన్నా సీఎం అభ్యర్థిని బయటకు ప్రకటించదు. నితీష్ పేరు అధికారికంగా చెప్పడం బీజేపీకి ఇష్టం లేదు. ఒకవేళ చెప్పినా ప్రజలకు క్లియర్ గా నితీష్ కావాలో, తేజస్వి యాదవ్ కావాలో తేల్చుకునే అవకాశం ఇచ్చినట్టే లెక్క. అందుకే బీజేపీ వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మహాగఠ్ బంధన్ సంగతేంటి?
సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముకేశ్ సహనీ పేర్లు ప్రకటించారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాత్. అయితే ఈ కూటమి ఎంత బలంగా ఉంది అనేదే అసలు ప్రశ్న. ఇప్పటి వరకు వచ్చిన ప్రీపోల్ సర్వేలన్నీ బీజేపీ కూటమిదే విజయం అని చెబుతున్నాయి. అంతమాత్రాన మహా గఠ్ బంధన్ డీలా పడాల్సిన అవసరం లేదు. బీహార్ ప్రజలు నితీష్ తో విసిగిపోయారని, కచ్చితంగా అధికార మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు కూడా కాంగ్రెస్ కూటమికి పాజిటివ్ వైబ్ తెస్తోంది.
కుమ్ములాటలు సమసిపోతాయా?
బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీకి దిగింది. ఆర్జేడీ 143 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది. సీపీఐ-9, సీపీఐ(ఎం)-4 స్థానాల్లో పోటీ పడుతుండగా.. ఎనిమిది స్థానాల్లో కూటమి పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడం విశేషం. దీంతో కూటమి కుదరలేదని బీజేపీ సంబరపడింది. కూటమి విచ్ఛిన్నమైందని, ఇప్పుడే గొడవలు మొదలయ్యాయని ఎద్దేవా చేసింది. కానీ కాంగ్రెస్ అందరికీ షాకిస్తూ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ప్రకటించడంతో బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. ఇప్పుడు ఎన్నికలు నితీష్ వర్సెస్ తేజస్విగా మారిపోయాయి. ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read: ఇంట్లో కూర్చుని మాట్లాడితే కుదరదు.. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చూసుకో