BigTV English

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?
Advertisement

Yellamma Movie : జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ మరోవైపు సినిమాలలో పలు కామెడీ పాత్రల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన వారిలో వేణు (Venu)ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు సినిమాలపై ఆసక్తితో జబర్దస్త్(Jabardasth) కార్యక్రమానికి దూరమవుతూ దర్శకుడుగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇలా వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన బలగం(Balagam) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ ఒక్క సినిమా వేణు కెరియర్ ను పూర్తిగా మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దిల్ రాజు తనకు తన బ్యానర్ లో మరో సినిమా అవకాశాన్ని కల్పించారు.


దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ?

ఇలా ఎల్లమ్మ(Yellamma) పేరుతో వేణు మరో సినిమాకు సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాని హీరో నానితో చేయాలనుకున్నారు. నాని కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో శర్వానంద్, నితిన్ వంటి హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు నితిన్ ఎల్లమ్మ సినిమాకు కన్ఫామ్ అయ్యారని అందరూ భావించారు కానీ దిల్ రాజు నిర్మాణంలో నటించిన తమ్ముడు సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కానీ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ కూడా తప్పుకున్నారు. ఇలా ఇన్ని రోజులు ఈ సినిమాకు హీరో దొరకక సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎల్లమ్మ సినిమాకు బడ్జెట్ చిక్కులు..

ఈ సినిమా నుంచి హీరోలందరూ తప్పుకోవడంతో చివరికి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎల్లమ్మ సినిమాని చేయాలని చిత్రబంధం భావించారు. ఈ సినిమా కథను దేవిశ్రీప్రసాద్ కు వినిపించడంతో కథ నచ్చిన ఆయన సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్(Devisri prasad) కి జోడిగా కీర్తి సురేష్(Keerthy Suresh) హీరోయిన్ గా నటించబోతున్నారని వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమా షూటింగుకు అన్ని ఆటంకాలు తొలగిపోయాయని భావిస్తున్న నేపథ్యంలో మరో చిక్కు వచ్చి పడింది..


ఎల్లమ్మ విషయంలో దిల్ రాజు ఆలోచన మారిందా?

ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో చేయాలని దిల్ రాజు డైరెక్టర్ వేణుకు సూచించారట కానీ వేణు మాత్రం ఈ సినిమా కోసం కాస్త బడ్జెట్ ఎక్కువగానే అవుతుందని, మరింత బడ్జెట్ పెంచమని కోరారట. అయితే దిల్ రాజు మాత్రం తాను చెప్పిన బడ్జెట్లోనే సినిమా చేయాలని చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా బడ్జెట్ విషయంలో ఎల్లమ్మ సినిమా బృందం తర్జనా భర్జన అవుతున్నారు. ఈ సినిమాకు అనుకున్న దానికంటే అత్యధికంగా బడ్జెట్ అయితే దిల్ రాజు వెనకడుగు వేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఇప్పుడప్పుడే ఎల్లమ్మ సినిమా మోక్షం లభించదని చెప్పాలి. మరి ఈ విషయంలో వేణు నిర్మాతకు అనుకూలంగానే నడుచుకుంటారా లేదా కొత్త నిర్మాతను ఎంచుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Related News

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Big Stories

×