BigTV English

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు
Advertisement

SYG : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోస్ లో సాయి తేజకు కూడా ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే గతంలో సాయి ఎంచుకునే స్క్రిప్టులు అంత ఆసక్తికరంగా ఉండేవి కాదు. కానీ పర్సనల్ గా సాయి తేజ వ్యక్తిత్వం నచ్చటం వలన చాలామంది కూడా తనను ఇష్టపడడం మొదలుపెట్టారు.


సాయి తేజ్ జీవితంలో ఊహించని సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాను చాలా కాలం పాటు సరిగ్గా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. అయితే మొత్తానికి కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఆ సినిమాతో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు సాయి. ఇక ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది.

సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు 

ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. గతంలో ఈ సంస్థ నిర్మించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తీసుకొచ్చింది. అయితే సంబరాలు ఏటిగట్టు సినిమా విషయంలో కొంచెం లేట్ చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి దాదాపు 50 రోజుల వరకు షూటింగ్ మిగిలింది.


ఈ సినిమా కొన్ని ఆర్థిక సమస్యల వలన ఆగింది అనే కథనాలు కూడా వినిపించాయి. ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్లు అష్ట కష్టాలు పడుతున్నారు. అయితే ఇది పూర్తి చేయకుండా మరోవైపు రెండు పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.

డిస్ట్రిబ్యూషన్ పై ఆశలు 

కొంతమంది సినిమాలు నిర్మించడం ద్వారా బాగా సంపాదిస్తారు. అది కూడా సినిమా ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ద్వారా అద్భుతమైన డబ్బులు వస్తాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను నైజం లో డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రై చేస్తున్నారు ట్రైన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న అఖండ టు సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాను కూడా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ కోసం ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్న సినిమాను పూర్తి చేయకుండా మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు ఎందుకు అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read:Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Related News

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Big Stories

×