BigTV English

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!

Fauzi Movie: ప్రభాస్ ఫౌజీలో మరో ముద్దుగుమ్మ.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన నటి!
Advertisement

Fauzi Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఫౌజీ సినిమా (Fauzi Movie)షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ పనులను శర వేగంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే నేడు ప్రభాస్ పుట్టినరోజు కావడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను అధికారకంగా ప్రకటించడమే కాకుండా టైటిల్ తో పాటు ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఫౌజీ ప్రపంచంలోకి చైత్ర ఆచార్..

ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మరొక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మరో కన్నడ ముద్దుగుమ్మ నటించే అవకాశాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైత్ర ఆచార్ (chaithraAchar)ప్రభాస్ ఫౌజీ సినిమాలో భాగం కాబోతున్నారు. ఇదివరకే ఈమె సప్త సాగరాలు దాటి సినిమాలో నటించారు. అదేవిధంగా నటుడు సిద్ధార్థ్ హీరోగా నటించిన త్రీ బిహెచ్ కే సినిమాలో కూడా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాల్లో కూడా నటించే అవకాశం అందుకోవడంతో ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతమైన సృష్టి..

తాజాగా ఈమె ఫౌజీ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఫౌజీ ఒక అద్భుతమైన సృష్టి అంటూ ఈమె దర్శకుడు పని తీరు పట్ల ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో చైత్ర ఏ పాత్రలో నటించబోతోంది ఏంటి అని వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో నటి ఇమాన్వీ (Imanvi) నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.


60 శాతం షూటింగ్ పూర్తి..

ఈ సినిమాలో ఇమాన్వితో పాటు సీనియర్ నటి జయప్రద, మిథున్ చక్రవర్తి అనుపమ కేర్ వంటి తదితరులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా దాదాపు 60 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది వేసవి సెలవులలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్, ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే విడుదల చేశారు.

Also Read: Actress Son Death: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటి కుమారుడు కన్నుమూత?

Related News

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Puri Sethupathi: ఆగిపోయిన పూరీ-సేతుపతి.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Big Stories

×