Fake Currency: ఏపీలో దొంగనోట్ల తయారీ కలకలం రేపింది. విశాఖ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ నోట్లు ముద్రిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తాగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి దొంగనోట్ల తయారీకి వాడుతున్న ప్రింటర్, ల్యాప్‌టాప్, నోట్లు తయారు చేసే పేపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆరు నెలల క్రితం ఎంవీపీ అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. 2020లో గుప్తాపై దొంగ నోట్ల కేసు నమోదు అయింది. అతడిపై ఇందౌర్, ముంబయిలో కేసులు ఉన్నాయి.
నిందితుడు గుప్తా దొంగనోట్ల తయారీ కేసులో 5 ఏళ్ల క్రితం జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తెలిసిందని విశాఖ డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఎంవీపీ కాలనీలో దొంగ నోట్లు ముద్రిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. దొంగ నోట్లు ముద్రించదానికి కావాల్సిన సామాగ్రిని, పేపర్ ను గుప్తా ముంబై నుంచి తీసుకోస్తున్నట్లు తెలిపారు. తనిఖీలు చేస్తున్న సమయంలో గుప్తా వద్ద గ్లాస్ మిషన్, లాప్ ట్యాప్ , రెండు కీ ప్యాడ్ ఫోన్లు, ఫేక్ కరెన్సీ నోట్లను సీజ్ చేసిన డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు.
‘విశాఖలో దొంగ నోట్లు ముద్రిస్తున్నారని సమాచారం వచ్చింది. నిన్న ఎంవీపీ కాలనీలోని ఓ ఇంట్లో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి దాడి చేశాము. ఈ దాడిలో శ్రీరామ్ అలియాస్ గుప్తా అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము. దొంగ నోట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం. అతడిని విచారించగా మధ్యప్రదేశ్ లో రెండు కేసులున్నట్లు తెలిసింది. గుప్తాతో పాటు వర ప్రసాద్, ఆనంద్ అనే ముగ్గురు కలిసి దొంగనోట్లు తయారు చేసి చెలామణి చేయాలనుకున్నారు. దొంగ నోట్లు తయారీకి ఉపయోగించే పేపర్, ఇంక్, 200, 500 నోట్ల సాఫ్ట్ కాఫీలను సీజ్ చేశాం. ఇంకా ప్రొసెస్ లో ఉండగానే పోలీసులు చాలా చాకచక్యంగా దొంగ నోట్లను పట్టుకున్నాము.
Also Read: Bengaluru Crime: మహిళపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత ఇంట్లో దోపిడీ, బెంగుళూరులో షాకింగ్ ఘటన
దొంగ నోట్ల ముద్రణ చాలా సీరియస్ క్రైమ్, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇంత పెద్ద నేరాన్ని అడ్డుకున్న టాస్క్ ఫోర్స్, ఎంవీపీ పోలీసులను సీపీ అభినందించారు’ అని డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు.